జపాన్‌లో జి-20 సదస్సుకు నిర్మల

ఆర్థిక మంత్రితో పాటు హాజరు కానున్న ఆర్‌బిఐ గవర్నర్ న్యూఢిల్లీ: జూన్ 8న జపాన్‌లో ప్రారంభం కానున్న జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి భారత్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. గత వారం తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రిగా ఆమె బాధ్యతలను స్వీకరించారు. జపాన్‌లోని ఫకువొకా నగరంలో ఈ సదస్సు […] The post జపాన్‌లో జి-20 సదస్సుకు నిర్మల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఆర్థిక మంత్రితో పాటు హాజరు కానున్న ఆర్‌బిఐ గవర్నర్

న్యూఢిల్లీ: జూన్ 8న జపాన్‌లో ప్రారంభం కానున్న జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి భారత్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతారామన్‌కు ఇది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. గత వారం తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రిగా ఆమె బాధ్యతలను స్వీకరించారు. జపాన్‌లోని ఫకువొకా నగరంలో ఈ సదస్సు జరగనుంది. సీతారామన్‌తో పాటు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ సదస్సుకు వెళతారు. ఈ సమావేశంలో మౌలిక రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ పన్ను విధానాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ముప్పుపై చర్చించనున్నారు. అలాగే కొన్ని దేశాలు వారి వాణిజ్య విధానాల్లో అవలంబిస్తున్న రక్షణాత్మక ధోరణి-, అంతర్జాతీయ వ్యాపారంపై దాని ప్రభావంపై కూడా చర్చించనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటును ఐఎమ్‌ఎఫ్ 3.6 నుంచి 3.3 శాతానికి తగ్గించిన వేళ ఈ సదస్సుకు ప్రాధా న్యం సంతరించుకుంది.

Nirmala to attend G-20 Finance Ministers meeting in Japan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జపాన్‌లో జి-20 సదస్సుకు నిర్మల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: