చివరికి న్యాయమే గెలిచింది

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీశారు. వారికి శిక్ష అమలు కోసం నిర్భయ కుటుంబమే కాకుండా దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. నిర్భయ తల్లి ఆశాదేవి 2013 నుంచి ఇప్పటి వరకు తన కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడుతూనే ఉంది. ఇక ఆమె వెంట అండగా ఉంటూ, వారి తరఫున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది […] The post చివరికి న్యాయమే గెలిచింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీశారు. వారికి శిక్ష అమలు కోసం నిర్భయ కుటుంబమే కాకుండా దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. నిర్భయ తల్లి ఆశాదేవి 2013 నుంచి ఇప్పటి వరకు తన కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడుతూనే ఉంది. ఇక ఆమె వెంట అండగా ఉంటూ, వారి తరఫున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డంపెట్టుకుంటూ, శిక్షను వాయిదా వేసుకుంటూ వస్తున్న దోషులను ఎలాగైనా ఉరికంబం ఎక్కించే వరకు వదిలిపెట్టలేదు ఆ మహిళా న్యాయవాది సీమా ఖుష్వాహ. దోషులకు ఉరిశిక్ష వాయిదా పడినప్పుడల్లా నిర్భయ తల్లి వెన్నంటి ఉంటూ ధైర్యం నింపింది.

2012లో నిర్భయ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు నిర్భయ కుటుంబానికి ఖుష్వాహ అండగా నిలుస్తూ వచ్చింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ నమోదు చేయడం, ఇతర విషయాల్లోనూ నిర్భయ తల్లిదండ్రులకు అండగా ఉంది. సాధారణంగా దోషుల తరఫునగానీ, బాధితుల తరపునగానీ న్యాయవాదిని పెట్టుకుంటే ఫీజు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ హైకోర్టులో నిర్భయ కేసుపై సమర్ధవంతంగా వాదించిన ఖుష్వాహ ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. తన స్నేహితురాలికి సాయం చేస్తున్నానని అనుకుందట. అంత గొప్ప మనసు ఆమెది.

చివరికి దోషులకు ఉరి వేయడంతో ఆమె సంతోషానికి అవధుల్లేవు. న్యాయవాది సీమా ఖుష్వాహా ఉత్తరప్రదేశ్‌కు చెందినది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యురాలిగా ఉన్న సీమా.. ఈ కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎన్నో సాక్షాధారాలు సేకరించి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేసి కోర్టుకు తుది నివేదిక సమర్పించింది సీమ. ఇంతా చేసి ఆమె ఏమీ పేరుమోసిన లాయర్ కూడా కాదు. ఇది ఆమెకు మొదటి కేసు. సంవత్సరాల తరబడి ఈ కేసు విచారణ, డెత్ వారెంట్లు జారీ కావడం, వాయిదాలు పడటం జరిగినా సీమ మడమ కదపని పోరాటం చేసింది. మొదటి కేసులోనే ఇలాంటి సంచలన విజయం సాధించిన సీమకి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Nirbhaya Mother Reacts After Rapists Hanged

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చివరికి న్యాయమే గెలిచింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: