జయజయహే మహిషాసురమర్దిని

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. అమ్మకు నైవేద్యంగా చక్రపొంగలి సమర్పిస్తారు. అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని […] The post జయజయహే మహిషాసురమర్దిని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. అమ్మకు నైవేద్యంగా చక్రపొంగలి సమర్పిస్తారు.

అయిగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అమ్మవారి నైవేద్యం

చక్ర పొంగలి
కావాల్సినవి: పెసరపప్పు: కప్పు, బియ్యం: ఒకటిన్నరకప్పు, నెయ్యి: రెండు కప్పులు, పంచదార, బెల్లం:కప్పు చొప్పున, యాలకులపొడి: అరచెంచా, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష:అన్నీ కలపి అరకప్పు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు: కప్పు, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు:కొద్దిగా, పచ్చ కర్పూరం: చిటికెడు.
తయారీ: బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు, కొబ్బరి ముక్కల్ని వేయించాలి. అదే బాణలిలో బియ్యం, పెసరపప్పును విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఐదు కప్పుల నీళ్లు తీసుకుని బియ్యం, పెసరపప్పును ఉడికించాలి. అన్నం ఉడికాక బెల్లం తురుము, పంచదార కలిపి అడుగు అంటకుండా ఉండేందుకు కప్పు నెయ్యివేసి కలపాలి. బెల్లం, పంచదార కరిగాక పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు, యాలకులపొడి, నేతిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం పలుకులు, కొబ్బరి ముక్కలు, పచ్చకర్పూరం వేసి, మిగిలిన నెయ్యి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

Nine day festival celebrating avatars of Goddess Durga

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జయజయహే మహిషాసురమర్దిని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: