వైద్యరంగంలో మరో మైలురాయిని దాటిన నిమ్స్…

అరుదైన వ్యాధికి.. మెరుగైన చికిత్స అవయువ మార్పిడి లేకుండా వ్యాధికి చెక్ పెట్టిన వైద్యులు ముఖ్యమంత్రి సహాయ నిధితో కుదుటపడ్డ పేదింటి కవలల ఆరోగ్యం వచ్చే నెలలో మరో ఆడపిల్లకు శస్త్రచికిత్స హైదరాబాద్: అత్యాధునికి వైద్య సేవలను అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) మరో మైలురాయిని అధిగమించింది. అరుదైన వ్యాధులకు సైతం మెరుగైన చికిత్సను అందించడంలో నిమ్స్ ఘనతకెక్కింది. కార్పోరేట్ ఆసుపత్రులకు సైతం సాధ్యం కాని వైద్యాన్ని అందిస్తూ.. వ్యాధిగ్రస్తులకు పూర్తి స్వస్తత చేకూర్చుతున్నారు. […] The post వైద్యరంగంలో మరో మైలురాయిని దాటిన నిమ్స్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అరుదైన వ్యాధికి.. మెరుగైన చికిత్స
అవయువ మార్పిడి లేకుండా వ్యాధికి చెక్ పెట్టిన వైద్యులు
ముఖ్యమంత్రి సహాయ నిధితో
కుదుటపడ్డ పేదింటి కవలల ఆరోగ్యం
వచ్చే నెలలో మరో ఆడపిల్లకు శస్త్రచికిత్స

హైదరాబాద్: అత్యాధునికి వైద్య సేవలను అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) మరో మైలురాయిని అధిగమించింది. అరుదైన వ్యాధులకు సైతం మెరుగైన చికిత్సను అందించడంలో నిమ్స్ ఘనతకెక్కింది. కార్పోరేట్ ఆసుపత్రులకు సైతం సాధ్యం కాని వైద్యాన్ని అందిస్తూ.. వ్యాధిగ్రస్తులకు పూర్తి స్వస్తత చేకూర్చుతున్నారు. ముఖ్యమంత్రి సహయ నిధితో పేదింటి ఆడపిల్లల ఆరోగ్యం కుదుటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సహయ సహకారాలతో నిరుపేదల రోగులకు అత్యాధునిక వైద్యచికిత్సను అందించగలుతున్నామంటున్నారు నిమ్స్ వైద్యులు. వివరాల్లోకి వెళ్లితే..

అరుదైన వ్యాధి..

ఓ పేదింట ముగ్గురు ఆడపిల్లలకు కాలేయానికి సంబంధించి ప్రొగ్రెసీవ్ ఫిమేల్ ఇంటెహెపటిక్ కొలస్టాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరు కవల పిల్లలు కావడం విశేషం. వడ్డే ప్రకాశ్, వడ్డే జ్యోతి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే. మొదటి కాన్పులో మీనాక్షి(6)కి జన్మనించిన జ్యోతి రెండవ కాన్పులో కవలల(5)ను ప్రసవించించి. ఆ ఇద్దరికి గాయత్రి, గీతలు నామకరణం చేసింది. దురదుష్టవశాత్తు ఆ ముగ్గురు ఆడపిల్లలకు లివర్‌కు సంబంధించి అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా మొదట కామెర్లతో బాధపడతారు. ఆ తర్వాత కాలేయం దెబ్బతినడం మొదలవుతుంది.

కార్పొరేట్ చేతులెత్తేస్తే..

ముందుగా 2017లో కవలపిల్లలు ఈ అరుదైన వ్యాధికి గురయ్యారు. దాంతో ప్రకాశ్ దంపతులు రెండేళ్ల క్రింద ఓ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. అందుకు ఆ దంపతులు ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు. దాంతో నిమ్స్‌ను ఆశ్రయించాల్సిందిగా కార్పొరేట్ వైద్యులు చేతులు దులుపుకున్నారు. ఆ మేరకు ప్రకాశ్ నిమ్స్ వైద్యులను సంప్రదించారు. దీంతో నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం అధిపతి డా. వీరప్ప, డా. తుమ్మా.వేణు మాధవ్‌లు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. వైద్య పరీక్షలను నిర్వహించడం కూడా కష్టసాధ్యమైన పరిస్థితుల్లో డా. సుకన్య సహకారంతో గాయిత్రికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

లివర్ ట్రాన్స్‌ప్లాంటేన్‌తో ప్రమేయం లేకుండా అరుదైన వైద్య విధానంతో నివారించడానికి సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో 2018 ఏప్రిల్ 4న అరుదైన శస్త్రచికిత్స ధానం(cholecystojejunocolic anastomosis)తో ఆ చిన్నారికి లివర్ పనితీరు మెరుగుపడింది. ఆ తర్వాత గీత కూడా ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. దాంతో ఆమెకు సంవత్సరం తర్వాత గత నెల 25న శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో కవల పిల్లలు ఇరువురి ఆరోగ్యం మెరుగుపడింది. ఈ క్రమంలో పెద్ద పాప అయిన మీనాక్షికి వచ్చేనెలలో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్టు నిమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యనిపుణులు డా. వేణు మాధవ్ తెలిపారు. ఆ కవలల విషయంలో తాము అనుసరించిన శస్త్ర చికిత్స విధానం ప్రపంచంలోనే చాలా అరుదుగా నిర్వహిస్తారని చెప్పారు. అలాంటి నిమ్స్‌లో విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఈ విషయంలో అన్ని రకాలుగా చేయూతనిచ్చిన నిమ్స్ సంచాలకులు డా. కె. మనోహర్, సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NIMS hospital doctors performs rare operation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వైద్యరంగంలో మరో మైలురాయిని దాటిన నిమ్స్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: