కూకట్‌పల్లిలో మానేపల్లి మూడో షోరూం

Nidhi-Agarwal
ప్రారంభించిన సినీనటి నిధి అగర్వాల్

మనతెలంగాణ/కూకట్‌పల్లి : సంప్రదాయ ఆభరణాలకు మారుపేరుగా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన మానేపల్లి జ్యూవెల్లరీ సంస్థ తమ 3వ షోరూమ్‌ను శుక్రవారం కూకట్‌పల్లి కెపిహెచ్‌బిలోని భాగ్యనగర్ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి నిధి అగర్వాల్ (ఇస్మార్ట్ శంకర్ ఫేం), సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మలు ముఖ్య అతిథులుగా హాజరై మానేపల్లి జ్యూవెల్లరీ నిర్వాహకులు మురళీకృష్ణ, గోపికృష్ణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బంగారు ఆభరణాల్లో 129 సంవత్సరాల చరిత్ర కలిగిన మానేపల్లి జ్యూవెల్లరీ షోరూంను కూకట్‌పల్లిలోని ఆభరణ ప్రియులకోసం తన చేతుల మీదుగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని దైవజ్ఞశర్మ అన్నారు.

మానేపల్లి జ్యూవెల్లరీలో మహిళలు ఎంతగానో ఆకర్షించే వివిధ రకాల వజ్రాభరణాలు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని నటి అగర్వాల్ తెలిపారు. నాణ్యతకు, నమ్మకానికి పెట్టిందే పేరుగా నగల ప్రియుల అభిమానాన్ని చూరగొంటూ మరిన్ని షోరూమ్‌లని ఏర్పాటు చేసే దిశగా నిర్వాహకులు ముందుకు సాగాలని వారికి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం మానేపల్లి జ్యూవెల్లరీలోని నగలను నిధి అగర్వాల్ ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు.

ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఆభరణాలు లభిస్తాయి
కూకట్‌పల్లిలోని మానేపల్లి జ్యూవెల్లరీలో మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నగలు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు మురళీకృష్ణ, గోపీ కృష్ణలు తెలిపారు. టెంపుల్ జ్యూవెల్లరీ, కుందన్ జ్యూవెల్లరీ, ట్రెడిషనల్ గోల్డ్ జ్యూవెల్లరీ, బ్రైడల్ జ్యూవెల్లరీ, ప్లాటినమ్ ఆభరణాలు అన్ని రకాల మోడల్స్ కలిగి ఖచ్చితమైన అతి తక్కువ ధరకే లభిస్తాయని తెలుగు ప్ర జల ఇష్టాలకు అనుగుణంగా ఆభరణాలు ఉంటాయన్నారు. – నిర్వాహకులు మురళీకృష్ణ, గోపీకృష్ణ

Nidhi Agarwal Launches Manepally Jewellery Showroom

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కూకట్‌పల్లిలో మానేపల్లి మూడో షోరూం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.