అభివృద్ధిలో ముందు నిలుద్దాం

అధికారులు అవినీతిరహితంగా ఉండాలి మిషన్ కాకతీయలో అవినీతి జరిగితే కఠిన చర్యలు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రేగోండ : సమగ్ర అభివృధ్దిలో జిల్లాలోనే మండలం ముందంజలో ఉండే విధంగా తీర్చిదిద్దే భాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని యంపిడీవో కార్యాలయంలో యంపీపి ఈర్ల సదానందం అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅథిదిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మండలాభివృధ్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని […]

అధికారులు అవినీతిరహితంగా ఉండాలి
మిషన్ కాకతీయలో అవినీతి జరిగితే కఠిన చర్యలు
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

రేగోండ : సమగ్ర అభివృధ్దిలో జిల్లాలోనే మండలం ముందంజలో ఉండే విధంగా తీర్చిదిద్దే భాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని యంపిడీవో కార్యాలయంలో యంపీపి ఈర్ల సదానందం అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅథిదిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మండలాభివృధ్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మిషన్ కాకతీయ పనుల్లో రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గం ద్వితీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల వల్ల 818ఎకరాల ఆయకట్టు పెరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ రెండవ దశకు 32చెరువు లకు గాను 19చెరువులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో అవకతవకతను తన దృష్టికి తీసుకువస్తే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తదని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా భీం ఘనపూర్ నుండి భూపాలపల్లికి, ఘనపూర్ చెరువు నుండి రేగొండ,మొగుళ్ళపల్లి, చిట్యాల మండలాలకు, చలివాగు ప్రాజెక్టు నుండి శాయంపేట మండలానికి మంచినీటి సరఫరాకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామాలలో ప్రతి కుటుంబానికి వంద లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మండలంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో విద్యుత్ సబ్ స్టేషన్, గోదాములు, బస్ స్టేషన్ నిర్మాణము జరగడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశిల్దార్ వెంకటయ్య, ఇంచార్జ్ యంపీడివో రవీందర్, ఏవో సురెందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, యంపిటీసిలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Stories: