ముదిరిన వివాదం

నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నంపై రగడ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు రెండు జిల్లాల పోలీసులకు తలనొప్పి వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఇరువర్గాల డిమాండ్ ఒకరిపై ఒకరి ఫిర్యాదులు,వీధికెక్కిన వివాదం సమగ్ర విచారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి ప్రేమ వివాహానికి అండగా నిలిచినందుకు పోలీసు విచారణ ఎదుర్కొన్న విద్యార్థులు ఆత్మహత్యాయత్యానికి పాల్పడటం,ప్రేమజంట ఇరువర్గాలకు చెందిన  వారు వీధికెక్కి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం ముదిరింది. మన తెలంగాణ / కరీంనగర్ ప్రతినిధి:ప్రేమ […]

నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నంపై రగడ
పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు
రెండు జిల్లాల పోలీసులకు తలనొప్పి వ్యవహారం
పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఇరువర్గాల డిమాండ్
ఒకరిపై ఒకరి ఫిర్యాదులు,వీధికెక్కిన వివాదం
సమగ్ర విచారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి

ప్రేమ వివాహానికి అండగా నిలిచినందుకు పోలీసు విచారణ ఎదుర్కొన్న విద్యార్థులు ఆత్మహత్యాయత్యానికి పాల్పడటం,ప్రేమజంట ఇరువర్గాలకు చెందిన  వారు వీధికెక్కి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం ముదిరింది.

మన తెలంగాణ / కరీంనగర్ ప్రతినిధి:ప్రేమ వివా హానికి అండగా నిలిచారనే నెపంతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న నలుగురు విద్యార్థుల గురువారం నాటి ఆత్మహత్యా యత్నం ఘటన జిల్లాలో పెను వివాదంగా మారి ముదురుతోంది. ఓ వైపు ప్రేమ జంట ఊరు వాడ విడిచి పెళ్లి చేసుకొని పారిపోగా వారి స్నేహితులైన పాపా నికి నలుగురు స్నేహితులు ఆసుపత్రి పాలయ్యారు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు అదృష్యం కావడంపై ఆందోళన పడుతున్న తల్లిదండ్రులు జరుగుతున్న ఘటనలు చూసి కలవరపడుతున్నారు. తమ కూతురు అదృశ్యంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి కూతురు కోసం ఎదురుచూస్తుండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలగురు యువకుల తల్లిదండ్రులు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిగురుమామిడి మండలంల నవాబుపేట గ్రామానికి చెందిన హన్మండ్ల రజని (17) అసలు పెళ్లే చేసుకోలేదని మెదక్ జిల్లా నంగునూర్ మండలంలోని ఆకినపల్లి గ్రామం అమ్మమ్మ ఇంటి నుంచి కిడ్నాపు గురైందని మాయ మాటలు చెప్పి బోయిని శంకర్ (20) ఎక్కడికో తీసుకెళ్లడాని అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తుండగా….పారిపోయిన వారికి ఆత్మహత్య యత్నం చేసుకున్న బోయిని సురేశ్, బోయిని రఘు, సాగర్, కొంకట సృజన్ లకు ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా కావాలనే పోలీసు కేసులు పెట్టించారని యువకుల తల్లిదండ్రులు, బంధువులు మండిపడు తు న్నారు. అయితే మెదక్ జిల్లా రాజ్‌గోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో అమ్మాయి అదృశ్యంపై కిడ్నాపు కేసు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో నలుగురు యువకులు పోలీ సుల వేధింపుల ఆరోపణపై ఆత్మహత్య యత్నానికి పాల్ప డడంపై ఇరు జిల్లాల పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి తోడు ప్రేమ జంట తల్లిదండ్రులు, బంధువులు ఒకరిపై ఒకరు ఆరో పణలు చేసుకుంటూ శుక్రవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో వేరు వేరుగా మీడియా సమావేశంలో మాట్లాడారు.
నా బిడ్డను కిడ్నాప్ చేశారు
పద్నాలుగు రోజుల క్రితం అమ్మమ్మ గారి ఇంటిలో వుంటున్న తన కూతురైన హన్మండ్ల రజనిని కిడ్నాపు చేశారు. డిసెంబర్ 26న తమ బిడ్డను అమ్మమ్మ ఇంటి నుండి చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన బోయిని శంకర్, అతని మరో నలుగురు స్నేహితులు సురేష్, రఘు, సాగర్, సృజన్ లు కిడ్నాప్ చేశారు. మా బిడ్డ కనబడకపోయే సరికి మెదక్ జిల్లా రాజ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాము. తమ బిడ్డను రక్షించి అప్పగించి కిడ్నాపర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎక్కడ వెతికినా తమ బిడ్డ ఆచూకి తెలియడం లేదు. తమకు కూడా ప్రాణభయం ఉంది. పోలీ సులు పట్టించుకోవడం లేదు. ఆడ పిల్ల అంటే ఎవరి కైనా భయం ఉంటుంది కదా. మా అమ్మాయిని సురక్షి తంగా కాపాడి అప్పగించాలని కోరుతున్నాము.
అమ్మాయి తల్లిదండ్రులు సత్యనారాయణ-స్వరూప
చట్టం పరిధి దాటి పోలీసులు వ్యవహరిస్తున్నారు
పెళ్లి చేసుకొని పారిపొయిన బోయిని శంకర్ కు స్నేహితు లు అయినంత మాత్రాన సహకరించారనే నెపంతో పోలీసు కేసు పెట్టించడం అన్యాయం. ఒకవేళ అనుమా నం వుంటే తీసుకొ నివెళ్లి విచా రించవచ్చు. కాని చిత్ర హింసలు పెడుతూ దుర్భాష లాడు తూ శారీరక, మాన సికంగా వేధించడం ఎంత వరకు సబబు. అక్రమంగా చట్ట విరుద్దంగా పదమూడు రోజులుగా పోలీస్ కస్టడీలో వుంచుకుంటున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తాము దళితులం అవడం చేతనే పోలీస్ స్టేషన్‌లో బలం లేకుండా పోయింది. పోలీసులు డబ్బుకు అమ్ముడు పో యారు. పారిపొయిన అమ్మాయి అబ్బాయిలది వేరు వేరు కులాలు అవడం చేతనే పోలీసులు పెద్ద ఎత్తున మా పిల్లలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమ పిల్లల పాత్ర ఎంత వరకు ఉందో నిజ నిర్ధారణ చేసు కోవాలని కోరుకుంటున్నాము. అక్రమంగా బనాయి ంచిన కేసు నుండి తమ పిల్లలను విముక్తి చేయాలని వేడు కుంటున్నాము.
– నలుగురు యువకుల తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాలు
ఆసుపత్రిని సందర్శించిన పౌర హక్కుల సంఘం నేతలు
ప్రేమ వ్యవహారంలో ప్రమేయం వుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు వేధింపులకు గురై పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైన ఆ నలు గురు యువ కులను పౌర హ క్కుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీలు సందర్శించి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి మాదవ కూమర స్వామి పోలీస్ చర్యలపై మండిపడ్డారు. ఇద్దరు ప్రేమికులు పారిపోతే…వారి మిత్రులైన పాపానికి పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన వెంటనే అత్యుత్సాహం చూపెట్టి చిత్ర హింసలకు గురి చేయడం చట్ట విరుద్దమని ఆరోపించారు. మిగతా సామాజిక వర్గాలకు చెందిన ప్రేమికులు పారిపోతే దళితులైన నలుగురు యువకులను ఇష్టం వచ్చిన రీతిలో దుర్బాషలాడిన సంబంధిత పోలీస్ అధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జరిగిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. యువకులు నలుగురికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం చేయించాల న్నారు. బాధితులకు అండగా నిలువా లని కోరారు. ఆసుపత్రి సందర్శించిన వారిలో దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ తో పాటు పౌర హక్కుల సంఘానికి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు.

Related Stories: