అనంతగిరి అటవీలో ఆగని వేట

అధికారుల పర్యవేక్షణ కరువు నెల రోజుల్లో రెండు కేసులు నమోదు ప్రమాదాలకు మరికొన్ని బలి జంతు ప్రేమికుల ఆందోళన మన తెలంగాణ/వికారాబాద్ రూరల్: మండల పరి ధిలోని ఆనంతగిరి అటవి ప్రాంతంలో ఉన్న మూగ జీవాలు వేటగాళ్ల చేతుల్లో పడి అటవీ ప్రాంతమంతా ఖాళీగా ఏర్పడితే తప్పా స్పందించరా అని వన్యప్రాణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లో రెండు సంఘటనలు జరిగినా తూతూ మంత్రంగా జరి మానాలు విధిస్తు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ధారూరు స్టేషన్ పరిధిలో […]

అధికారుల పర్యవేక్షణ కరువు
నెల రోజుల్లో రెండు కేసులు నమోదు
ప్రమాదాలకు మరికొన్ని బలి
జంతు ప్రేమికుల ఆందోళన

మన తెలంగాణ/వికారాబాద్ రూరల్: మండల పరి ధిలోని ఆనంతగిరి అటవి ప్రాంతంలో ఉన్న మూగ జీవాలు వేటగాళ్ల చేతుల్లో పడి అటవీ ప్రాంతమంతా ఖాళీగా ఏర్పడితే తప్పా స్పందించరా అని వన్యప్రాణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లో రెండు సంఘటనలు జరిగినా తూతూ మంత్రంగా జరి మానాలు విధిస్తు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ధారూరు స్టేషన్ పరిధిలో బుధవారం ఏడుగురు వ్యక్తు లు జింకమాంస వండుకొని తింటూ పట్టుబడ్డారు. ఇలా తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయోన ని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. అనంతగిరి అటవీ ప్రాతంలో ప్రతి నిత్యం రాత్రి వేళల్లో వేటాడుతున్నట్లు అధికారులకు తెలిసినా బహిరంగ రహస్యమేనని పలు గ్రామాల ప్రజలు వాపో తున్నారు. కర్నాటక రాష్ట్రం చించొలి కుంటారం, మధ్యన విస్తరించి ఉన్న పెద్ద అటవి నుంచి బం ట్వారం, మోత్కుపల్లి, మోమిన్‌పేట మండలం గుట్టకే సారం, మద్దులపల్లి, మైలారం, దేవురంపల్లి, అనంత గిరి, కెరెళ్లి, పూడూరు, దామగుండ వరకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో వందలాది దుప్పులు, జింక లు, లక్షలాది నెమల్లు, కోతులు, అడవి పందులు, కం జుపెట్టేలు ఉన్నట్లు ఫారెస్టు అధికారుల వద్ద ఉన్న లెక్కలు చెబుతున్నాయి. ఈ వన్యప్రాణులను సంరక్షిం చే ముందస్తు ప్రణాళికలు అధికారుల వద్ద లేకపోవడం వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నా యి. వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు కుర వక ఆటవీ ప్రాతంలో మూగజీవాలకు తగిన ఆహారం దొరకక పోవడంతో తాగునీటికోసం చుట్టుపక్కల గ్రా మాల్లో వ్యవసాయ పొలాల్లోకి, గ్రామాల్లోకి వెలుతు న్నాయి. ఇదే అదునుగా వేటగాళ్లు వాటిని మట్టుబెట్టి పండుగ చేసుకుంటునట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన వాటిని సంరక్షించే చర్యలు చేప ట్టాలని అ టవీ ప్రాతాల నుచుట్టు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేస్తే వన్యప్రాణులను సంరంక్షించవచ్చునని పేర్కొంటున్నా రు. గత రెండు నెలల్లోనే ఈ ప్రాతంలో సుమారు ఆరు దుప్పీలు రోడ్డు ప్రమాదాలకు గురి కాగా పదుల సంఖ్యలో వేటకు గురయినట్లు సమాచారం. వరుస వే టలు జరుగుతున్నా అధికారుల్లో స్పందన లేదని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Related Stories: