కమనీయం.. రమణీయం…

కన్నులపండువగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు తిలకించి పులకించిన భక్తజనం రామనామస్మరణతో మార్కోగిన భద్రగిరి నేత్రానందంగా సాగిన తిరువీధి సేవ భద్రాచలం: దక్షణ భారత అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుక సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేతుడై గరుఢ వాహనారుడైన శ్రీ భద్రాద్రి వైకుంఠ రాముని ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలు మూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. వేలాది మంది భక్తులు ముందు […]

కన్నులపండువగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీరామచంద్రుడు
తిలకించి పులకించిన భక్తజనం రామనామస్మరణతో మార్కోగిన భద్రగిరి
నేత్రానందంగా సాగిన తిరువీధి సేవ

భద్రాచలం: దక్షణ భారత అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుక సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేతుడై గరుఢ వాహనారుడైన శ్రీ భద్రాద్రి వైకుంఠ రాముని ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలు మూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. వేలాది మంది భక్తులు ముందు రోజు అర్థరాత్రి సమయానికే ఉత్తర ద్వారం ప్రాంతానికి చేరుకున్నారు. ఆ శుభ ఘడియలు సమీపించేంత వరకు వేచి ఉండి స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. దేదీప్యమానంగా కాంతులీనుతున్న విద్యుత్ దీపాల మధ్య భద్రాద్రి రాముడు జయజయధ్వనాల నడుమ ఉత్తర ద్వారంలో భక్తులలకు దర్శనమిచ్చారు. ఉత్తరద్వారా గుండా వైకుంఠ రామున్ని దర్శించుకుంటే సకల పాపాలు హరించు కుపో తాయని, సుఖ శాంతులతో విలసిల్లుతారని శాస్త్రాలో ఘోషిస్తున్నాయి. సోమవారం తెల్లవారు ఝామున సరిగ్గా 12.30 గం. నుంచి 1.30 గం. వరకు భక్తరామదాసు సేవగా రెవెన్యూ అధికారులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భద్రాచలం రామాలయం తరుపున గంట పాటు 2.30 గం. వరకు ఆర్జిత సేవలు జరిపారు.

అనంతరం తె.ఝామున 3.30 గం. వరకు బాలభోగం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. స్వామివారిని గరుఢ వాహనంపై ఉంచి వెనుక వైపు నుంచి ఉత్తర ద్వారంలోనికి తీసుకోచ్చారు. సరిగ్గా 5 గం.లకు జయ గంటలు మ్రోగుతుండగా, రామనామ సంకీర్తలనల నడుమ ఉత్తర ద్వారం తలుపులు వైభవోపేతంగా తెరుచుకున్నాయి. వైకుంఠాన్ని తలపించే విధంగా ప్రత్యేకంగా అలంకరించిన ఉత్తరద్వారం వేదిక వద్ద దూపదీప నైవేద్యాల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామి వారిని చూసిన భక్తులు పులకించి పోయారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద పెట్టున రామనామస్మరణ చేశారు. భద్రాద్రివాసా… వేకుంఠ రామా పాహిమామ్.. పాహిమామ్ అంటూ తన్మయత్వానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారంలో గంట పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రామాయణమహా అనే సహస్త్ర నామంతో అష్టోత్తర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. నివేదన, ఫల నైవేద్యాన్ని స్వామికి అందజేసి మంత్రపుష్పాలను సమ ర్పించారు. రుగ్వేద, యజుర్వేద, సామ,ఆదర్మవేదాలను వేద పండితులు పఠించి 108 వత్తులతో వైకుంఠ రామునికి హా రతి పట్టారు. శరణాగతి దండకం అనంతరం ద్వారదర్శన విశి ష్టతను అర్చకులు భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు.

ముక్కోటికి మూడు రకాల పేర్లు : ముక్కోటికి మూడు రకాల పేర్లు ఉంటాయని వాటిలో మోదటిది వైకుంఠ ఏకాదశి, రెండోది ముక్కోటి ఏకాదశి, మూడోది మోక్షదా ఏకాదశి అని వేదపండితులు వివరించారు. సూర్యభగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని పిలుస్తారని తెలిపారు. ఏడాదికి 24 ఏకాదశలు వస్తుంటాయని, ఏకా దశులు దేవుళ్లకు ఇష్టమైన రోజులని, వైకుంఠ ఏకాదశిని ఉపవాసంతో ఆచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని తెలిపారు. పరమ పవిత్రమైన కాలంలో వచ్చే ఏకాదశియే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతులు శ్రీ మహావిష్ణువును శ్రీ వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుంచి ఈ ఏకాదశి నాడే దర్శిస్తారని, అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినట్లు తెలియ జేశారు. వేదపిండుతులు పూజాది కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహించారు.

నేత్రవర్వంగా తిరువీధి సేవ : ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం అనంతరం నిర్వహించిన తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. వేదపండితుల మంత్రోశ్చరణలతో ఆరాధ్యదైవమైన రామయ్య తండ్రి తిరువీధి సేవకో రాజభోగంతో వెడలారు. ఉత్తర ద్వారం నుంచి ఆండాళ్లమ్మ, రామానుజ నమ్మళ్లవార్, పెరియాళ్వార్ వెంట రాగా గోవిదంరాజు స్వామివారి ఆలయం వరకు తిరువీధి సేవ సాగింది. అక్కడ్నుంచి స్వామివారు తిరిగి మేళతాళాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. ఈ సంద ర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారు వేంచేస్తున్న వాహనం ముందు భక్తుల కోలాట నృత్యాలు వైభవంగా సాగాయి. స్వామివారు వేంచేస్తున్న సమయంలో మంగళనీరాజనాలు అందుకున్నారు. స్వామివారిని కన్నులారా తిలకించిన భక్తులు పులకించి పోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పి షాన్‌వాజ్ ఖాసీమ్, ఐటిడిఏ పిఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బులికృష్ణ, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కూరాకుల జ్యోతి, భద్రా చలం ఏఎస్పి భాస్కరణ్, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, మాజీ ఎంపి పోరిక బలామ్ నాయక్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related Stories: