గోదావరి జలం మహారాష్ట్రపైనే ఆధారం

వీడుతున్న సాగునీటి చిక్కులు ప్రాణహిత బ్యారేజి నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు జిల్లాలో అదనపు ఆయకట్టుకు అందనున్న సాగనీరు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ప్రవహించే గోదావరి నీటిపై అక్కడి ప్రభుత్వ ఆంక్షలు అనేక ఇక్కట్లు సృష్టిస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా గోదావరిపై ప్రాజెక్టులు, అడ్డుకట్టలు నిర్మిస్తుండడంతో జీవనది ప్రవాహానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వేలాది టిఎంసిల గోదావరి నీటిని మహారాష్ట్ర కేంద్ర జల సంఘం, ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్దంగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. […]

వీడుతున్న సాగునీటి చిక్కులు
ప్రాణహిత బ్యారేజి నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు
జిల్లాలో అదనపు ఆయకట్టుకు అందనున్న సాగనీరు

సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి ప్రవహించే గోదావరి నీటిపై అక్కడి ప్రభుత్వ ఆంక్షలు అనేక ఇక్కట్లు సృష్టిస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా గోదావరిపై ప్రాజెక్టులు, అడ్డుకట్టలు నిర్మిస్తుండడంతో జీవనది ప్రవాహానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వేలాది టిఎంసిల గోదావరి నీటిని మహారాష్ట్ర కేంద్ర జల సంఘం, ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్దంగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ జల వివాదాలు సాధారణ పరిపాలన సంబంధాలకు ఆటంకం అవుతోంది. ఇప్పటికే బాసర వైపు నుంచి ప్రవహించే గోదావరి నదిపై మహారాష్ట్ర తన సరిహద్దులో దాదాపు 12కుపైగా ప్రాజెక్టులను నిర్మించి నీటి ప్రవాహన్ని నిలిపివేస్తోంది.

మన తెలంగాణ / ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. బాబ్లీ ప్రాజెక్టు వివాదం ఇరురాష్ట్రాల మధ్య విభేదాలను సైతం సృష్టించింది. అలాగే గోదావరి ఉపనది అయిన ప్రాణహిత పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. మహారాష్ట్ర నుంచి ప్రవహించే ప్రాణహిత, పెన్‌గంగా నదుల నీటి వినియోగంపై అక్కడి ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుంది. సహజ న్యాయం ప్రకారం ఎగువ నుంచి దిగువ వైపునకు నదులు ప్రవహిస్తుంటాయి. అయితే ఈ సహజన్యాయాన్ని మహారాష్ట్ర ఇప్పటి వరకు పక్కనపెట్టి ఇష్టానుసారంగా జల చౌర్యానికి పాల్పడుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చి మహారాష్ట్రతో గత ఏడాది కాలం నుంచి విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంప్రదింపుల కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం తెలంగాణ రాష్ట్రంతో సక్యతకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహనతో సానుకూలంగా అభిప్రాయాలు పంచుకొని గోదావరి నీటి వినియోగంపై ఓ అంగీకారానికి వచ్చాయి. దీంతో గత కొద్దిరోజుల నుంచి వివాదాస్పదంగా మారిన ప్రాణహిత బ్యారేజి నిర్మాణానికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బ్యారేజి నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపు సమస్య తలెత్తకుండా ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీనికోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సైతం చర్చలు జరిపి సానుకూలతను సృష్టించారు. ఈ బ్యారేజి నిర్మాణానికి ఏర్పడ్డ సాంకేతిక పరమైన అవరోధాలన్ని తొలగిపోవడంతో మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మంత్రి హరీష్‌రావు చర్చించనున్నారు. ఈ చర్చలు ఇదే చివరిసారి కాబోనున్నాయంటున్నారు. మహారాష్ట్ర నుంచి అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ లభించగానే ప్రాణహిత బ్యారేజి నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశాలు ఏర్పడుతాయి. దీంతో జిల్లాలో అదనపు ఆయకట్టుకు పెద్ద ఎత్తున సాగునీరు అందనుంది.

Related Stories: