ఒకరికి సంతోషం…మరొకరికి దుఃఖం

లాస్ వేగాస్ : సౌందర్య ప్రియులకి మనోరంజకమైన ఈవెంట్ మిస్ యూనివర్స్. ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మిస్ యూనివర్స్ పోటి ఒకరికి అమితమైన ఆనందాన్ని ఇస్తే మరొకరికి మరువలేని దుఃఖాన్ని మిగిల్చింది. ఆదివారం లాస్ వేగస్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ యూనివర్స్ టైటిల్‌ని మిస్ ఫిలిప్పిన్స్ పియా అలొన్జో దక్కించుకుంది. అయితే యాంకర్ తడబాటు మిస్ కొలంబియాకు దుఃఖాన్ని మిగిల్చింది. తొలుత మిస్ యూనివర్స్ టైటిల్ ప్రకటించే సమయంలో యాంకర్ పొరపాటున మిస్ […]

లాస్ వేగాస్ : సౌందర్య ప్రియులకి మనోరంజకమైన ఈవెంట్ మిస్ యూనివర్స్. ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మిస్ యూనివర్స్ పోటి ఒకరికి అమితమైన ఆనందాన్ని ఇస్తే మరొకరికి మరువలేని దుఃఖాన్ని మిగిల్చింది. ఆదివారం లాస్ వేగస్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ యూనివర్స్ టైటిల్‌ని మిస్ ఫిలిప్పిన్స్ పియా అలొన్జో దక్కించుకుంది. అయితే యాంకర్ తడబాటు మిస్ కొలంబియాకు దుఃఖాన్ని మిగిల్చింది. తొలుత మిస్ యూనివర్స్ టైటిల్ ప్రకటించే సమయంలో యాంకర్ పొరపాటున మిస్ కొలంబియా అరియడ్నా గుటిరేజ్ పేరుని ప్రకటించడంతో మాజీ మిస్ యూనివర్స్ పాలీనా వేగా ఆమె కిరీటాన్ని బహుకరించింది. ఇంతలోనే “ఐ రియల్లి అపాలజైస్..” అంటూ పొరపాటున మీ పేరని ప్రకటించామని నిర్వాహకులు తెలిపి కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. కొన్ని క్షణాలు మిస్ యూనివర్స్‌గా ఉన్న గుటిరేజ్ ఒక్కసారిగా దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. ఆమె వద్ద నుంచి తీసుకున్న కిరీటాన్ని అసలు విజేత మిస్ ఫిలిప్పిన్స్‌కి బహుకరించారు. అయితే ఇది సంఘటన పొరపాటున జరిగిన సంఘటన అని ఇందులో ఎవరి తప్పు లేదని ఇందుకు తాను బాధపడడం లేదని గుటిరేజ్ పేర్కొంది.

విలపిస్తున్న గుటిరేజ్‌ను ఓదారుస్తున్న తోటి పోటీదారులు…

Related Stories: