గోదావరికి మహాహారతి

* ధర్మపురిలో సాంస్కృతిక వైభవం చాటిన గోదావరి మహాహారతి * భక్తుల కోలాహలంతో పులకించిన గోదావరి ఒడ్డు * పునీత గోదావరి పరిరక్షణే ధ్యేయం * నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ * గోదావరి పవిత్రతను కాపాడాలని పిలుపు మన తెలంగాణ / కరీంనగర్: ‘ఇమమే గంగే యమునే సరస్వతి!! ’అని రుగ్వేద కాలం నుంచీ నదులను కీర్తిస్తూ ,పూజిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణ, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులను స్మరించ కుండా […]

* ధర్మపురిలో సాంస్కృతిక వైభవం చాటిన గోదావరి మహాహారతి
* భక్తుల కోలాహలంతో పులకించిన గోదావరి ఒడ్డు
* పునీత గోదావరి పరిరక్షణే ధ్యేయం
* నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ
* గోదావరి పవిత్రతను కాపాడాలని పిలుపు

మన తెలంగాణ / కరీంనగర్: ‘ఇమమే గంగే యమునే సరస్వతి!! ’అని రుగ్వేద కాలం నుంచీ నదులను కీర్తిస్తూ ,పూజిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణ, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులను స్మరించ కుండా ఏ పనినీ మొదలుపెట్టరని, ఏ శుభకా ర్యము ప్రారంభించరని భారతీయ సంస్కృతీ సంప్రదాయం. గోదావరి మహా హారతి ఉత్సవ కమిటీ ప్రతి ఏటా చేపట్టే కార్యక్రమం ధర్మపురి క్షేత్ర గంగా నదీతీరంలో కన్నుల పండుగగా కొనసా గింది. గోదావరి పవిత్రతను కాపాడాలనే పిలుపు నిచ్చిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. తెలంగాణ గంగగా చెప్పుకునే గోదావరి నది వ్యవసాయానికి కేంద్ర బిందువు. భూగర్బ జలాలకు ఆయువుపట్టు. అతి పెద్ద నదుల్లో గోదావరి నది ఒకటి. భారతదేశంలో గంగానది తరువాత అతిపెద్ద నది గోదావరి. ఎక్కడో మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శిఖరాల్లో గోదావరి పుట్టి 431 మైళ్లు మహారాష్ట్రలో, 479 మైళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బాసర నుండి ఉత్తర తెలంగాణను తన స్పర్శతో తాకుతూ ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాద్రిల ప్రాంతాలను సేద తీర్చడమే గాకుండా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయాణించి సముద్రాన్ని చేరుతోంది.

పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఈ నదిప్రస్తుతం వ్యర్థాలతో, మానవ తప్పిదాలతో దారితప్పి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలో ఈ నదిని కాపాడడమే ధ్యేయంగా ముందుకు సాగుతోన్న గోదావరి మహా హారతి ఉత్సవ కమిటీ దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన ధర్మపురి క్షేత్రంలో ఆదివారం గోదావరి మహహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నదిలో గత నాల్గు సంవత్సరాల నుండి గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2015 లో వ్యవస్థాపక చైర్మన్ మురళీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ పాల్గొన్నారు. కార్యక్రమంలో తదనంతరం హైదరాబాద్, కరీంనగర్, నిజమాబాద్‌లకు చెందిన విద్యార్థుల పేరడి నృత్యాలు భక్తులను ఎంతగానో కనువిందు చేశాయి. గోదావరి నది నీటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం 6 గంటలకు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం ఆధ్వర్యంలో గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిజీ చేతుల మీదుగా గోదావరి (గంగకు) మాతకు మహా హారతి ఇచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది భక్తులు హారతిని తిలకించి గోదావరి నదిలో దీపాలు వదిలారు. గోదావరి ప్రాంతంలో ఆకాశంలోకి వదిలిపెట్టిన దీపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తానికి గోదావరి మహా హారతి కార్యక్రమం సాంస్కృతిక వైభవాన్ని చాటగా భక్తుల కోలాహాలంతో ధర్మపురి గోదావరి నది తీరం పులకించి పోయిందని చెప్పోచ్చు. కమిటి భక్తుల కోసం ఉచిత ప్రసాదాల పంపిణి కౌంటరు,్ల త్రాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిద జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు..

Related Stories: