సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి : సిపి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : పోలీసుల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హైదరాబాద్ సిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రం భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ఇంగ్లండ్, అమెరికా, సింగపూర్ పోలీసులు వ్యవస్థలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితంగా నేర నిర్ధారణకు అవకాశం ఉంటుందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా , నిజాయితీతో పని చేయాలని కోరారు. హైదరాబాద్ గ్లోబల్‌సిటీగా మారాలంటే శాంతభద్రతలు బాగుండాలని అభిప్రాయపడ్డారు. Comments comments

హైదరాబాద్ : పోలీసుల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హైదరాబాద్ సిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రం భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ఇంగ్లండ్, అమెరికా, సింగపూర్ పోలీసులు వ్యవస్థలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితంగా నేర నిర్ధారణకు అవకాశం ఉంటుందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా , నిజాయితీతో పని చేయాలని కోరారు. హైదరాబాద్ గ్లోబల్‌సిటీగా మారాలంటే శాంతభద్రతలు బాగుండాలని అభిప్రాయపడ్డారు.

Comments

comments

Related Stories: