నిశ్శబ్ద అలజడి

మన తెలంగాణ / కరీంనగర్: నాటి పీపుల్స్‌వార్ నుంచి నేటి మావోయిస్టుల వరకు కరీంన గర్ జిల్లాకు ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంటూ వస్తోంది. మొన్నటి ఆదిలాబాద్, వరంగల్ ఎన్‌కౌంటర్లు నిన్నటి ఖమ్మం జిల్లా కిడ్నాపులు ఒక ఎత్తు అయితే తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తాలుకు ఛాయలు జిల్లాలో పోలీసు లు నిర్వహిస్తున్న జాయింట్ ఆఫరేషన్ యాక్షన్లే ఉదాహ రణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మావోల కదలికలు జిల్లాలో లేవని చెబుతూనే మారుమూల గ్రామాల్లో పోలీసుల కదలిక […]

మన తెలంగాణ / కరీంనగర్: నాటి పీపుల్స్‌వార్ నుంచి నేటి మావోయిస్టుల వరకు కరీంన గర్ జిల్లాకు ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంటూ వస్తోంది. మొన్నటి ఆదిలాబాద్, వరంగల్ ఎన్‌కౌంటర్లు నిన్నటి ఖమ్మం జిల్లా కిడ్నాపులు ఒక ఎత్తు అయితే తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తాలుకు ఛాయలు జిల్లాలో పోలీసు లు నిర్వహిస్తున్న జాయింట్ ఆఫరేషన్ యాక్షన్లే ఉదాహ రణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మావోల కదలికలు జిల్లాలో లేవని చెబుతూనే మారుమూల గ్రామాల్లో పోలీసుల కదలిక లు పెరిగిపోతుండడం, ముమ్మర తనిఖీలు జరుగుతుండడం గ్రామ ప్రజల్లో కలవరా న్ని సృష్టిస్తున్నాయి. గతంలో మావోల కదలికలు పెద్ద ఎత్తున కనబడే కరీంనగర్ జిల్లాలో పోలీసుల ఒత్తిడి పెరిగిపోవడంతో గత కొంత కాలంగా ఛత్తీస్‌ఘడ్ బస్తర్ జిల్లా కేంద్రంగానే కరీంనగర్ ఆపరేషన్ నిర్వహించిన మావోలు మొన్నటి భారీ ఎన్‌కౌంటర్ తరువాత అక్కడి నుంచి బిచానా ఎత్తేసి కరీంనగర్ జిల్లాకు ప్రవేశించే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, తెలం గాణ లకు చెందిన మూడు రాష్ట్రాల జాయింట్ ఆప రేషన్ టీం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మహాదేవపూర్, పంకెన, పరిమళ గ్రామాల్లో మకాం వేశారు. ఏ క్షణంలోనై మావోలు అడుగు పెట్టోచ్చనే అనుమానాలు పోలీసుల్లో బలంగా ఉన్నాయి. అ యి తే ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణాన్ని చూపెడుతున్నాప్పటికీ పోలీసుల కదలికలే పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా బార్డర్స్‌లో మావోలు మాటు వేశారనే పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతాలన్నీ పోలీసుల పట్టులో ఉన్నటుగా తెలుస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మైదాన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఉన్నత చదువులు చదు వుకున్న విద్యార్థినీ, విద్యార్థులు విప్లవ సాహిత్యానికి ఆకర్షి తులవుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో ఇటు మైదాన ప్రాంతాల్లో కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు. మొత్తాని కి సరిహద్దు ప్రాంతాల్లో ఇటు పోలీసులు అటు మావోల సవాలు ప్రతి సవాళ్లతో కరీంనగర్ జిల్లా మరోసారి పోలీసుల అలర్ట్‌ను చూపిస్తుండగా మారు మూల గ్రామాల్లో మాత్రం ప్రజలు ఉలిక్కిపడుతు న్నారు.
తెలంగాణ సర్కార్ 18 నెలల పాలనలో మావోయిస్టులపై ఉక్కు పాదం మోపుతుందని బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోంద ని, ఇప్పటికే పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న క్రమంలో ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లా నిశ్శబ్దపు అలజడి సృష్టిస్తుందని చెప్పవచ్చు. తాజా సంఘటనలతో అధికార పార్టీ కి చెందిన నాయకులు పల్లెలు వదిలి పట్టణాలకు వస్తుండగా ప్రజా ప్రతినిధులకు మాత్రం పోలీసులు భద్రత పరంగా ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.
ఊపిరి పోసుకుంటున్న సింగరేణి కార్మిక సమాఖ్య ?
జిల్లాలో దశాబ్ధాలకు పైగా నక్సల్స్ ఉద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన సింగరేణి కార్మికుల నుంచి పుట్టిన సికాస మళ్లీ పురు డు పోసుకుంటోందా అనే సందేహాలు ఈ మధ్య కాలంలో సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. నక్సల్స్ సానుభూతిపారులు, క్రీయశీలకమైన కార్యకర్తలతో సికాసను మరోసారి రూపుదిద్ది తెలంగాణ సర్కార్ పాలనలో కూడా ప్రభావాన్ని చూపెట్టుందుకు ప్రయత్నాలు కొనసాగు తున్నాయంటూ సమాచారం. ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 వందల మంది కార్య కర్తలను ఒక టీంగా ఏర్పాటు చేసినట్లు గా పోలీసులు నమ్ముతున్నారు. ఒకవేళ గతంలో మాదిరిగా సికాస పునరుద్ధరణ జరిగితే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం మద్దతు ఉండి పెద్ద ఎత్తున గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు కార్మికుల సమా ఖ్యకు చెక్కు పెట్టినట్టు అవడమే కాకుండా ప్రభుత్వ వ్యతిరే కంగా ఓ ఆయుధంగా నిలుస్తోందని సికాస భావిస్తోంది. ఈ క్రమంలో సింగరేణి పలు సమస్యలను ఇప్పటికే తెలంగాణ సర్కార్ పరిష్కరించి కొంత మేరకు కార్మికుల మద్దతును కూడగట్టుకున్నప్పటికీ సికాస ప్రధాన ఎజెండా మరోవిధంగా ఉంది. ప్రధానంగా ఒపెన్ కాస్ట్ మైనింగ్ వ్యతిరేకంగా, సకలజనుల సమ్మె కాలంలోని వేతనం ఇవ్వని ప్రభుత్వ నిర్ణయం లాంటి డిమాండ్లను ఆధారంగా చేసుకొని సికాస ను కార్మికులోకి తీసుకవెళ్లే ఆలోచనలో ఉన్నట్టు వినబడుతుంది.
రీంనగర్ జిల్లా మావోలకు సెంటర్ జోనా ?
కొంత కాలంగా జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసు లు పట్టు సాధించిన దరిమిలా సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాలను ఆధారంగా చేసుకొనే రిక్రూట్‌మెంట్లు, శిక్షణలు ఇస్తున్నట్లు జిల్లా పోలీసులు భావిస్తున్న తరుణంలో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, కెకెడబ్లు కమిటీలు, దండకారణ్య ప్రాంతాల్లో (ఛత్తీస్‌ఘడ్) పర్మినెంట్ సెంటర్ జోన్లుగా కొనసా గుతున్న క్రమంలో వరుస ఎన్‌కౌంటర్లు జిల్లాలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు గతంలోలాగా జిల్లాలో వారీగా కూంబింగ్‌లు కాకుండా అంతరాష్ట్ర, అంతర్‌జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తుండడం కొంతమేరకు జిల్లాలో మావోలు కరీంనగర్ జిల్లాను ట్రాన్స్‌పోర్టు జోన్ (రాకపోక లకు మాత్రమే) ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో పోలీసులకు పట్టుబడ్డు మసాకే ఆడ్మా బహిర్గతం చేసిన విషయాలెన్నో ?
రెండు నెలల క్రింద ఛత్తీస్‌ఘడ్ సుకుమా జిల్లాకు చెందిన మావోయిస్టు డిప్యూటీ కమాండర్ హుస్నాబాద్‌లో పట్టుబడ డం పలు సంచననాలకు కేంద్ర బిందువైంది. ఎక్కడో సుకుమా జిల్లా నుంచి వచ్చి హుస్నాబాద్ లో ఎందుకున్నారంటూ పోలీ సులు ఆరా తీయగా పలు విషయాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌ఘడ్ జిల్లాకు మం దుగుండు సామగ్రిని చేరవేసేందుకు వచ్చి మసాకే ఆడ్మా హుస్నాబాద్‌లో పోలీసులకు పట్టబడ్డట్టు తెలుస్తోంది. కారణం జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లకు వాడే బ్లాస్టింగ్ సామగ్రిని సదరు కాంట్రాక్టరు నుంచి తీసుకొని వెళ్లే క్రమం నడుస్తోందని ఆడ్మా పట్టుబడడంతో పోలీసులు షాకయ్యారు. ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సాలో మందుగుండు సామగ్రి అవసరం మేరకు లేకపోవడంతోనే ఈ పనులకు మావోలు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన జిల్లా పోలీసులు ప్రాజెక్టులు నిర్మిస్తున్న సదరు కాంట్రాక్టర్లను విచారించి ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ నుండి వచ్చే కూలీల సంబంధించిన ఐడి కార్డులను తీసుకోవల్సిందిగా అప్రమత్తం చేశారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. మసాకే ఆడ్మా కూడా ఓ దినసరి కూలీగానే సదరు కాంట్రాక్టు దగ్దర పని కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా లో నిర్మిత మవుతున్న ప్రాజెక్టులతో కూడా మావోలు ప్రయోజనాలు పొందుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హైఅలర్ట్‌తో ఉన్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో కూడా దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలతో జిల్లాలో పోలీసుల మావోల చర్యలతో జిల్లా వాసులు హడల్లిపోతున్నారని చెప్పవచ్చు.

Related Stories: