ఐఎస్ తదుపరి టార్గెట్ న్యూయార్క్?

న్యూయార్క్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల పారిస్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు తమ తదుపరి లక్షంగా అమెరికాలోని న్యూయార్క్‌ను ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఐఎస్ ఉగ్రవాదులే వీడియో దృశ్యాలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో భద్రత కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోను పరిశీలించినట్టు న్యూయార్క్ పోలీసు అధికారి స్టీఫెన్ డేవీస్ తెలిపారు. ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియో ఇప్పటిది కాదని ఆయన […]

న్యూయార్క్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల పారిస్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు తమ తదుపరి లక్షంగా అమెరికాలోని న్యూయార్క్‌ను ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఐఎస్ ఉగ్రవాదులే వీడియో దృశ్యాలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో భద్రత కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోను పరిశీలించినట్టు న్యూయార్క్ పోలీసు అధికారి స్టీఫెన్ డేవీస్ తెలిపారు. ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియో ఇప్పటిది కాదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల టార్గెట్‌లో న్యూయార్క్ టాప్‌లో ఉండి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే న్యూయార్క్‌పై దాడులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆయన పేర్కొన్నారు.

Comments

comments