పెళ్లి సీన్‌లో కాళ్లు వణికాయి!

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యంగ్ హీరోగా రాణిస్తున్నాడు నవీన్‌చంద్ర. విలక్షణమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నవీన్‌చంద్ర, కలర్స్ స్వాతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘త్రిపుర’. ఈ హార్రర్ థ్రిల్లర్ ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్రతో ఇంటర్వూ విశేషాలు… *‘త్రిపుర’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? ‘త్రిపుర’లో నవీన్‌చంద్ర అనే సైకియాట్రిస్ట్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నా. ఇదొక హార్రర్ థ్రిల్లర్. నా పాత్ర తీరుతెన్నుల్లో […]

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యంగ్ హీరోగా రాణిస్తున్నాడు నవీన్‌చంద్ర. విలక్షణమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నవీన్‌చంద్ర, కలర్స్ స్వాతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘త్రిపుర’. ఈ హార్రర్ థ్రిల్లర్ ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్రతో ఇంటర్వూ విశేషాలు…

*‘త్రిపుర’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘త్రిపుర’లో నవీన్‌చంద్ర అనే సైకియాట్రిస్ట్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నా. ఇదొక హార్రర్ థ్రిల్లర్. నా పాత్ర తీరుతెన్నుల్లో చాలా వేరియన్స్ ఉంటాయి. ఓవైపు త్రిపురకు మంచి భర్తగా నటిస్తూనే మరోవైపు విలన్ షేడ్‌లో కూడా కనిపిస్తాను. ఈ చిత్రానికి హీరో, విలన్ రెండూ నేనే. నా పాత్ర చివరి వరకు సస్పెన్స్‌తో నడుస్తుంది.
* మీ పాత్ర కోసం ముందుగానే ప్రిపేరయ్యారా?
డాక్టర్ అంటే క్లీన్ షేవ్‌తో హుందాగా ఉండాలి. సైకియాట్రిస్ట్ అంటే ఇంకా ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం బెంగుళూర్‌లో ఒక డాక్టర్ వద్ద కొన్ని రోజులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. దీంతో సినిమాలో సైకియాట్రిస్ట్‌గా చాలా పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తా.
* హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి?
దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న కలర్స్ స్వాతి బాగా పాపులర్ అయింది. ఇటీవలే వరుసగా హిట్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో స్వాతితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సినిమాలో త్రిపుర పాత్రలో స్వాతి కనిపిస్తుంది. ఒక సాధారణ అమ్మాయిలాగే కనిపించినా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోదు. త్రిపుర, నవీన్‌చంద్రల మధ్య సాగే జర్నీనే ఈ చిత్రం. మా మధ్య బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంటుంది. మా మధ్య కెమిస్ట్రీ చక్కగా పండింది. మా జంట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.
* ‘త్రిపుర’లో మరచిపోలేని సన్నివేశం ?
సినిమా ప్రారంభంలోనే పెళ్లి సన్నివేశాలొస్తాయి. ఆ పెళ్లి సెటప్‌ను చూస్తే నిజంగానే మాకు పెళ్లి చేస్తున్నారా అనేలా ఎక్కడ రాజీపడకుండా భారీగా తెరకెక్కించారు. అయితే పెళ్లి సన్నివేశాలు షూట్ చేసే సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. తాళి కట్టే సమయంలో నా కాళ్లు వణికాయి. పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలని అప్పుడర్థమైంది. ఈ పెళ్లి సీన్ నా కెరీర్‌లో మరిచిపోలేను.
* సినిమాలను ఎలా ఎంపికచేస్తారు?
‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించాను. ఆతర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ పెద్ద బ్రేక్ రాలేదు. కారణం నేను నా పాత్రలకే ప్రాధాన్యతనిచ్చాను. కానీ కథ గురించి ఆలోచించలేదు. దీంతో ఆయా చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ‘త్రిపుర’తో పూర్తిగా పంథా మార్చాను. బలమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. మంచి కథ, పాత్రకు ప్రాధాన్యముంటే విలన్‌గా కూడా నటిస్తాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవలన్నదే నా లక్షం.
* తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే చిత్రంలో నటించాను. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది. తమిళ్‌లో ఓ చిత్రం చేస్తున్నాను.

Comments

comments

Related Stories: