‘ఎవడో ఒకడు’

రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మి స్తున్న చిత్రం ‘ఎవడో ఒకడు’. ఈ సినిమా హైదరాబాద్‌లోని దిల్ రాజు కార్యాలయంలో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ము హూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు సుకుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సుకుమార్, దిల్‌రాజు, వినాయక్, రవితేజలు కలిసి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు అందిం చారు. అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో […]

వితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మి స్తున్న చిత్రం ‘ఎవడో ఒకడు’. ఈ సినిమా హైదరాబాద్‌లోని దిల్ రాజు కార్యాలయంలో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ము హూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. దర్శకుడు సుకుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సుకుమార్, దిల్‌రాజు, వినాయక్, రవితేజలు కలిసి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు అందిం చారు. అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “హిట్ మూవీ భద్ర  తర్వాత మా కాంబినేషన్‌లో వస్తు న్న చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందనుంది. ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్ కూడా ఇందులో నటించనుంది. అక్టోబర్ 25 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశాం” అని అన్నారు. ప్రకాష్‌రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ః దేవిశ్రీప్రసాద్, కెమెరాః రిచర్డ్ ప్రసాద్, డైలాగ్స్‌ః రమేష్-గోపి, ఎడిటర్‌ః కార్తీక్ శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్స్‌ః శిరీష్, లక్ష్మణ్.