రుణమాఫీ చేయాలంటే సస్పెండ్ చేస్తారా?

ప్రతిపక్షాలు లేకుండా సభ నడపడం సిగ్గుచేటు, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి ప్రభుత్వ భరోసా లేకనే రైతుల ఆత్మహత్యలు,  ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి,  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చిగురుమామిడి: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలో వెళ్తుందని ఈ నెల 7న హైదరాబా ద్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. […]

ప్రతిపక్షాలు లేకుండా సభ నడపడం సిగ్గుచేటు, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి
ప్రభుత్వ భరోసా లేకనే రైతుల ఆత్మహత్యలు,  ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి,  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

చిగురుమామిడి: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలో వెళ్తుందని ఈ నెల 7న హైదరాబా ద్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించలేని ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, దీంతో పేద, బడుగు బలహీనవార్గలకు అంబలే గతయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ నిల్వలు చేస్తూ కృత్తిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా అధికార యంత్రాంగం నిర్లక్షం చేస్తుందని మండిపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నా నాయకులు మొద్దునిద్ర వీడడం లేదన్నారు. కేంద్రం లో నరెంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 15నె లలు గడుస్తున్నా నల్లధనం వెలికి తీతలో విఫల మైందని ఆరోపించారు.

బిహార్ రాష్ట్రంలో జరుగు తున్న ఎన్నికల్లో ప్రజలు బుర్జవ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని చాడ డియాండ్ చేశా రు. అనంతరం చిగురుమామిడిలోని బొల్లమల్ల రాజా మౌళి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు బిల్లు రాక మధ్యలో నిలిపివేయగా ఆ ఇళ్లును చాడ పరిశీలిం చారు. బిల్లుల రాక మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.5లక్షలు చెల్లించి, వారికి డబుల్ బెడ్ రూంలు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మండల కార్యదర్శి అందె స్వామి, ఎంపిపి తాడురి కిష్టయ్య, నాయకులు దుడ్డెల లక్ష్మీనా రాయణ, గుడెం లక్ష్మి, పెద్దపల్లి రవీందర్‌పటేల్, సొసైటీ చైర్మన్ చాడ శ్రీధర్‌రెడ్డి, పైడిపెల్లి మల్లేశం గౌడ్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పైడిపెల్లి శ్రీనివాస్‌గౌడ్, అందె చిన్నస్వామి, తాళ్లపల్లి చంద్రయ్యగౌడ్, శ్రీమూర్తి సాయిరెడ్డి, మావురపు రాజు, ము ద్రకోల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

అహం వీడకపోతే గుణపాఠం తప్పదు
హుజూరాబాద్‌టౌన్: అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని సిఎం కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చురకలంటించారు. భూపోరాటం కేసులో హుజూరాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక ఐబి గెస్ట్‌హౌస్‌లో విలేఖ రులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని అరెస్టు చేసి తగిన శాస్తి జరిగిందంటూ ముఖ్య మంత్రి వ్యాఖ్యలు చేయడం ఆ స్థాయిని దిగజార్చు తుందని మండిప డ్డారు. ఉద్యమ సమయంలో కెసిఆర్‌ను అరెస్టు చేసిన ప్పుడు కూడా అప్పటి ముఖ్యమం త్రులు ఇంత దారు ణంగా మాట్లాడలేదని చాడ గుర్తు చేశారు. ప్రతిపక్షా లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయ డం సరికాదని, ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ నేతలు తమ తీరుమార్చు కుంటే మంచిదని హితవు పలికారు.

సాగునీటి ప్రాజె క్టుల డిజైన్ల మార్పు, రైతు ఆత్మహత్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదని, కరువు ప్రాంతాల గుర్తింపునకు ఇప్పుడా స ర్వే మొదలు పెట్టేది అని నిలదీశా రు. ప్రజల బతుకు లు మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వా నిదని, ఆ బాధ్యత ను విస్మరిస్తే ప్రతిఘటన ఎదుర్కో వాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు తమ బతుకులు బాగుపడతాయని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నార ని, స్వరాష్ట్రంలోనూ వారి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదంటూ ఆందో ళన వ్యక్తం చేశా రు. జిల్లాలో 28 వేల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు పెండిం గ్‌లో ఉండగా, కేవలం 3600 ఇళ్లకు మాత్రమే ఇటీవల క్లియరెన్స్ ఇచ్చారని, మిగతా బిల్లు ల పరిస్థితి ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల హామీపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, ని యోజక వర్గానికి 400 ఇళ్లు మాత్రమే నిర్మిస్తామంటే పేదలం దరి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం లో 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుం బాన్ని కూడా ముఖ్యమంత్రి పరామర్శిం చిన పాపాన పోలేదన్నారు. సిఎం క్యాంప్ ఆఫీస్, ఫాం హౌస్‌లకే పరిమితమవుతున్నాడని, సెక్రటేరియ ట్‌కు రావడమే మర్చిపోయాడని అన్నారు. ముఖ్య మంత్రి ఇప్పటికీ మాటలతోనే కడుపులు నింపాలని ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. శృతి, సాగర్ ఎన్ కౌంటర్‌పై హై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామి క వేదిక ఆధ్వ ర్యంలో బుధవారం వామపక్షాల భేటీ నిర్వహిస్తున్నా మని తెలిపారు. ప్రజాసమస్యలపై వేది క ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. సమా వేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోమ టిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కర్రె భి క్షపతి, నాయకులు గోవిందుల రవి, రవీందర్‌రెడ్డి, రాజుగౌడ్, పర్శరాములు, నకీర్త ఓదెలు, రాజు, వేణు గోపాల్, లంకదాసరి కల్యాణ్ పలువురున్నారు.

Comments

comments

Related Stories: