ఇసుకాసురులకు కాసుల వర్షం

  భారీ వర్షం తెచ్చిన ఇసుక సంపద.. రైతులకు కడగండ్లు.. దళారులకు సిరులు.. వాగుల్లో ఇసుక కోసం ట్రాక్టర్ల జాతర మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: భారీ వర్షాలు రైతులకు కడగండ్లను మిగిలిస్తే ఇసుకాసురులకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆగస్టు నెల నుండి ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి పంట పొలాలన్నీ ఇసుక మేటలు కమ్మేశాయి. వాగుల్లో మునుపెన్నడూ లేని రీతిలో వాగుల్లో, పంట పొలాల్లో […] The post ఇసుకాసురులకు కాసుల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారీ వర్షం తెచ్చిన ఇసుక సంపద..
రైతులకు కడగండ్లు.. దళారులకు సిరులు..
వాగుల్లో ఇసుక కోసం ట్రాక్టర్ల జాతర

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: భారీ వర్షాలు రైతులకు కడగండ్లను మిగిలిస్తే ఇసుకాసురులకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆగస్టు నెల నుండి ఇప్పటి వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి పంట పొలాలన్నీ ఇసుక మేటలు కమ్మేశాయి. వాగుల్లో మునుపెన్నడూ లేని రీతిలో వాగుల్లో, పంట పొలాల్లో ఇసుక దిబ్బలు పేరుకుపోయాయి. ఈ భారీ వర్షాల వల్ల రైతులకు కష్టం మిగిల్చగా ఇసుక దందా చేసే బ్రోకర్లకు మాత్రం కాసులు కురిపిస్తుంది. గత వారం రోజుల నుండి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆకేరు, మున్నేరు, అటవీ ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లోని వాగుల్లో ఇసుక కోసం ట్రాక్టర్లు జాతరలా కనిపిస్తున్నాయి. ఎప్పుడు లేని వింత ఈ సంవత్సరం వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు అత్యధికంగా నమోదయ్యాయి. కొట్టుకుపోయిన పంటల నుండి రైతులు తేరుకొనలేదు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసినప్పటికి ఎలాంటి నష్టపరిహారం ఇప్పటి వర కు అందలేదు. రైతులు పొలాలను చదును చేసుకుందామని వెళితే ఇసుక మేటలు పంటపొలాలను కమ్మేశాయి. ఒకపక్క నష్టపోయిన పంట మరోపక్క కమ్మేసిన ఇసుక మేటలను తొలగించాలంటే రైతులకు గుదిబండగా మారింది. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉన్నా.. వాగుల నుండి ఇసుకను తోడి అమ్మే ఇసుకాసురులకు మాత్రం ఈ అవకాశం కలిసొచ్చినట్లయింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షపాతం అధికంగానే నమోదై వాగులు, వంకలన్ని ఇసుక మేటలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలే కనబడుతున్నాయి.

స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లి అమ్ముకునే వారికి ఈ ఏడాది భారీగా కలిసొచ్చింది. ట్రాక్టర్లు, మినీట్రక్కులు, డిసిఎంలు, లారీలు, టిప్పర్లలో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. గురువారం వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న ఆకేరువాగులో ఇసుక కోసం ట్రాక్టర్ల జాతర కొనసాగుతుంది. ఎక్కడ చూసినా వాగుల నుండి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. గోదావరి ఇసుక మాత్రమే ఎక్కువగా తరలించే మధ్య దళారులు అవసరం లేకుండానే స్థానికంగా ఉన్న ఇసుకను మార్కెటింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్ ఒక్కంటికి రూ.వెయ్యి నుండి లారీల వరకు రూ.60 వేల వరకు అమ్ముతున్నారు. ఇసుక తరలింపుకు ఖర్చులు అధికంగా రాకపోవడంతో ఎక్కువ శాతం ఇసుకను అమ్మడానికి గ్రామాల్లో ఉన్న వాహనాలన్ని ఇసుక లోడ్‌కే తరలించడం గమనార్హం.

చోద్యం చూస్తున్న యంత్రాంగం..
భారీ వర్షాలతో ఒకపక్క రైతులు పంటలను నష్టపోవడమే కాకుండా ఇసుకను ఎత్తిపోయలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. దళారులు వాగుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉంటుంది. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం చేతులు తడుపుకొని ఉండడం వల్ల యధేచ్ఛగా అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. ప్రతిఏడు జరిగే ఇసుకదందాకు ప్రస్తుతం జరుగుతున్న ఇసుక దందాకు భారీ తేడా ఉంది. ఈసారి రైతుల భూములను నష్టపెట్టి ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. రైతులకు ఆ ఇసుక తీసుకెళ్లే ఇసుకాసురుల నుండి ఎలాంటి రుసుం చెల్లించకుండానే అక్రమంగా తీసుకుపోవడం వల్ల రైతులు చూస్తూ ఉండిపోతున్నారు. వాగుల నుండి వచ్చిన వరద పంటపొలాలను ముంచినందున ఆ ఇసుకను అమ్ముకునే హక్కు కూడా వారికి కల్పిస్తే ఎంతలో కొంత నష్టాన్ని పూడ్చినట్లవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపి ఆయకట్టు పొలాల రైతులకే ఇసుకను అమ్ముకునే హక్కును కల్పించాల్సిన అవసరం ఉంది.

Illegal Sand Mining Continues in Warangal District

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఇసుకాసురులకు కాసుల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: