రాజీ మార్గంతోనే మండలి సంస్కరణలు

  జి 4 వాదనకు భారత్‌కు చెక్‌పెట్టిన చైనా బీజింగ్: ఐరాస భద్రతా మండలి విస్తరణ, ఇతరత్రా సంస్కరణలకు ఆమోదయోగ్య పరిష్కార పద్ధతి అవసరం అని చైనా స్పష్టం చేసింది. భద్రతా మండలిలోకి భారతదేశ ప్రవేశానికి చైనా తరచూ అడ్డుగోడగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుత ఐరాస సర్వప్రతినిధి సభ సదస్సు నేపథ్యంలోనే చైనా తన వైఖరిని తెలిపింది. ఐరాస సంస్కరణల విషయంలో పలు అభిప్రాయభేదాలు ఉన్నాయని, ముందుకు ఆమోదయోగ్య లేదా రాజీమార్గ ప్రతిపాదన దీనిని అంతా సమ్మతించడం […] The post రాజీ మార్గంతోనే మండలి సంస్కరణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జి 4 వాదనకు భారత్‌కు చెక్‌పెట్టిన చైనా

బీజింగ్: ఐరాస భద్రతా మండలి విస్తరణ, ఇతరత్రా సంస్కరణలకు ఆమోదయోగ్య పరిష్కార పద్ధతి అవసరం అని చైనా స్పష్టం చేసింది. భద్రతా మండలిలోకి భారతదేశ ప్రవేశానికి చైనా తరచూ అడ్డుగోడగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుత ఐరాస సర్వప్రతినిధి సభ సదస్సు నేపథ్యంలోనే చైనా తన వైఖరిని తెలిపింది. ఐరాస సంస్కరణల విషయంలో పలు అభిప్రాయభేదాలు ఉన్నాయని, ముందుకు ఆమోదయోగ్య లేదా రాజీమార్గ ప్రతిపాదన దీనిని అంతా సమ్మతించడం అవసరం అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఇక్కడ గురువారం మీడియా భేటీలో తెలిపారు. భద్రతా మండలి విస్తరణతో కూడిన సమగ్ర ఐరాస సంస్కరణలను ఇండియా దీర్ఘకాలంగా కోరుతోంది. ఇటీవలే జి 4 దేశాల సదస్సులో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.

ఈ కూటమిలో ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో జి 4 శక్తివంతమైన ప్రపంచ స్థాయి వేదికగా మారింది. జి 4 సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ భద్రతా మండలి తక్షణ సంస్కరణల పర్వం అవసరం అన్నారు. దీనిని ప్రస్తావించకుండా ఇప్పుడు చైనా ప్రతినిధి స్పందించారు. భద్రతా మండలి సంస్కరణలు అవసరం అనే విషయాన్ని తమ దేశం కూడా తగు విధంగా గుర్తించిందని అన్నారు. అయితే ఇది అత్యంత కీలక విషయం అని, ముందుగా దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరం అని తెలిపారు. పలు సభ్య దేశాల దీర్ఘకాలిక డిమాండ్లకు, అంతకు మించి ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ వాదన విన్పిస్తోందని, ఇటువంటి అంశాలపై అనివార్యంగా పద్ధతితో కూడిన ఆమోద ప్రక్రియ అవసరం అన్నారు. ఐరాస 75వ సర్వప్రతినిధి సభ సమావేశాలు ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జి 4 దేశాల నుంచి మండలి సత్వర విస్తరణ, సంస్కరణలకు డిమాండ్ తలెత్తడం, దీనికి స్పందనగా చైనా విదేశాంగ ప్రతినిధి జవాబు ఇవ్వడం కీలకంగా మారింది.

G4 nations call for decisive push for reforms in unsc

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రాజీ మార్గంతోనే మండలి సంస్కరణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: