దేశభక్తి చాటుకున్న స్థానికులు (వైరల్)

హైదరాబాద్: దేశవ్యాప్తంగా శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చింది. కాగా, ‌నగరంలోని ఎస్సార్ నగర్ పరిధిలోని అమీర్ పేట్ గురుద్వార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. నగరంలో గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ క్రమంలో త్రివర్ణ పతాకం తడవకుండా గొడుగును ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలకారణంగా జెండా ఎగరేయడానికి […] The post దేశభక్తి చాటుకున్న స్థానికులు (వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చింది. కాగా, ‌నగరంలోని ఎస్సార్ నగర్ పరిధిలోని అమీర్ పేట్ గురుద్వార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. నగరంలో గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ క్రమంలో త్రివర్ణ పతాకం తడవకుండా గొడుగును ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలకారణంగా జెండా ఎగరేయడానికి ఆటంకాలు ఏర్పాడ్డాయి. గుండె నిండా దేశభక్తి ఉంటే జెండా ఎగరువేయడానికి ఏదీ అడ్డు కాదంటున్న మరో ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో బీహార్ లోని ఓ ప్రాంతంలో తీసినట్టు తెలుస్తోంది. కొందరు వర్షపు నీటిలో ఉన్న జాతీయ పతాకాన్ని వందనం చేస్తుండటం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

74th Independence Day celebration 2020

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దేశభక్తి చాటుకున్న స్థానికులు (వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: