రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

న‌ల్ల‌గొండ : కట్టంగూర్ సమీపంలో  జాతీయ ర‌హ‌దారి 65పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న డిసిఎం వ్యానును వేగంగా వచ్చిన కారు  అదుపుత‌ప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న అభి(30), రేణుక(28) అనే ఇద్ద‌రు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైద‌రాబాద్ ఇసిఐఎల్‌కు చెందిన‌వారిగా గుర్తించారు. వీరు కారులో […] The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న‌ల్ల‌గొండ : కట్టంగూర్ సమీపంలో  జాతీయ ర‌హ‌దారి 65పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న డిసిఎం వ్యానును వేగంగా వచ్చిన కారు  అదుపుత‌ప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న అభి(30), రేణుక(28) అనే ఇద్ద‌రు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైద‌రాబాద్ ఇసిఐఎల్‌కు చెందిన‌వారిగా గుర్తించారు. వీరు కారులో విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జరిగింది.  పోస్టుమార్టం కోసం అభి, రేణుకల  మృత‌దేహాల‌ను న‌కిరేక‌ల్ ప్ర‌భుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. కారు అతివేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కట్టంగూర్  పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: