నిలకడగా గాయకుడు ఎస్ పి ఆరోగ్యం

చెన్నయ్ : ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్ పి చరణ్ వెల్లడించారు. కరోనా సోకడంతో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న చెన్నయ్ లోని ఎంజిఎంలో చేరారు. ఆయన ఆరోగ్యంపై  వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుద చేస్తూ వస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించిందని , ఆయనను ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు శుక్రవారం వైద్యులు తెలిపారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు […] The post నిలకడగా గాయకుడు ఎస్ పి ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్ పి చరణ్ వెల్లడించారు. కరోనా సోకడంతో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న చెన్నయ్ లోని ఎంజిఎంలో చేరారు. ఆయన ఆరోగ్యంపై  వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుద చేస్తూ వస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించిందని , ఆయనను ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు శుక్రవారం వైద్యులు తెలిపారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనచెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రముఖులు ఆయన తనయుడు చరణ్ కు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. దీంతో చరణ్ తన తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స చేయడం మేలు చేసిందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని , వీలైంనత త్వరలో ఆయన కోలుకుని మామూలు స్థితికి వస్తారని తన సందేశంలో చరణ్ తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నిలకడగా గాయకుడు ఎస్ పి ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: