చలివాగులో చిక్కుకున్న ఆ రైతులు సురక్షితం

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లా పరిధిలోని చలివాగులో చిక్కుకున్న రైతులు సురక్షితంగా బయటపడ్డారు. టేకుమాట్ల మండల పరిధిలోని కుందనపల్లికి చెందిన 12 మంది రైతులు శనివారం ఉదయం వ్యవసాయ మోటర్లు తెచ్చుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారు చలివాగులో చిక్కుకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కెటిఆర్ వారిని రక్షించేందుకు ఘటనాస్థలికి రెండు హెలికాప్టర్లను పంపించారు. దీంతో ఆ రైతులను రెస్క్యూ టీమ్ రక్షించింది. చలివాగు నుంచి రైతులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం […] The post చలివాగులో చిక్కుకున్న ఆ రైతులు సురక్షితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లా పరిధిలోని చలివాగులో చిక్కుకున్న రైతులు సురక్షితంగా బయటపడ్డారు. టేకుమాట్ల మండల పరిధిలోని కుందనపల్లికి చెందిన 12 మంది రైతులు శనివారం ఉదయం వ్యవసాయ మోటర్లు తెచ్చుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారు చలివాగులో చిక్కుకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కెటిఆర్ వారిని రక్షించేందుకు ఘటనాస్థలికి రెండు హెలికాప్టర్లను పంపించారు. దీంతో ఆ రైతులను రెస్క్యూ టీమ్ రక్షించింది. చలివాగు నుంచి రైతులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులను రక్షించే క్రమంలో ఘటనాస్థలిలో పరిస్థితులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఎ గండ్ర వెంకటరమాణారెడ్డిలు పర్యవేక్షించారు. తమను రక్షించేందుకు హెలికాప్టర్లను పంపించిన మంత్రి కెటిఆర్ కు రైతులు , వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post చలివాగులో చిక్కుకున్న ఆ రైతులు సురక్షితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: