ఆర్‌టిసి కరోనా బాధితులను ఆదుకుంటాం: మంత్రి పువ్వాడ

ఆర్టీసి కరోనా బాధితులను ఆదుకుంటాం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులు, అధికారులు కోవిడ్19 బారిన పడి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విచారం వ్యక్తం చేశారు. సంస్థ తరపున బాధితులకు అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న్రా. కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందించాలని ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చామన్నారు. ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు […] The post ఆర్‌టిసి కరోనా బాధితులను ఆదుకుంటాం: మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆర్టీసి కరోనా బాధితులను ఆదుకుంటాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులు, అధికారులు కోవిడ్19 బారిన పడి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విచారం వ్యక్తం చేశారు. సంస్థ తరపున బాధితులకు అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న్రా. కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందించాలని ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చామన్నారు. ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత పాటించినట్లయితే కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని మంత్రి పువ్వాడ సూచించారు. బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, చికిత్స అందించడానికి గాంధీ ఆసుపత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్‌లో మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులకు ధైర్యమే మఖ్యమని, దిగులు చెందకుండా ప్రాథమిక దశలో తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తికి అరికట్టవచ్చన్నారు. కరోనా బాధితులకు సంస్థ నిబంధనల ప్రకారం తగిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంస్థ తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Will take care to RTC corona victims: Puvvada Ajay

The post ఆర్‌టిసి కరోనా బాధితులను ఆదుకుంటాం: మంత్రి పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: