వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం!

వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం! ప్రెస్‌మీట్ నుంచి ట్రంప్ మధ్యలోనే నిష్క్రమణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం కరోనా వైరస్‌పై వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ హఠాత్తుగా అక్కడ నుంచి నిష్క్రమించడం కలకలం సృష్టించింది. ట్రంప్ మీడియా సమావేశం ప్రారంభించిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తన వెంట ట్రంప్‌ను హడావుడిగా బయటకు తీసుకెళ్లడం విలేకరులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్ది నిమిషాల తర్వాత తిరిగి మీడియా వద్దకు వచ్చిన […] The post వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం!
ప్రెస్‌మీట్ నుంచి ట్రంప్ మధ్యలోనే నిష్క్రమణ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం కరోనా వైరస్‌పై వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ హఠాత్తుగా అక్కడ నుంచి నిష్క్రమించడం కలకలం సృష్టించింది. ట్రంప్ మీడియా సమావేశం ప్రారంభించిన వెంటనే ఆయన వద్దకు వచ్చిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తన వెంట ట్రంప్‌ను హడావుడిగా బయటకు తీసుకెళ్లడం విలేకరులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్ది నిమిషాల తర్వాత తిరిగి మీడియా వద్దకు వచ్చిన ట్రంప్ వైట్ హౌస్ వెలుపల కాల్పులు జరిగినట్లు ప్రకటించడంతో షాక్‌కు గురవ్వడం మీడియా ప్రతినిధుల వంతైంది. అయితే పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని ట్రంప్ చెప్పారు. బయట కాల్పులు జరిగాయని, ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారని ట్రంప్ తెలిపారు.

కాల్పులు జరిపింది పోలీసులని, కాల్పులు ఎదుర్కొన్న వ్యక్తి సాయుధడని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అనుమానితుడిపైన కాల్పులు జరిగాయని ఆయన అన్నారు. సీక్రెట్ ఏజెంట్ తనను ఓవల్ ఆఫీసు(అధ్యక్షుని కార్యాలయం)కు తీసుకెళ్లాడని ఆయన చెప్పారు. తన భధ్రత కోసం సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలను ట్రంప్ ప్రశంసించారు. ఈ సంఘటనతో భయపడ్డారా అని విలేకరులు ప్రశ్నించగా తనకు తెలియదని, భయపడినట్లు మీకు కనపడుతున్నానా అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. కాగా, వైట్ హౌస్‌కు కొద్ది దూరంలోని పెన్సిల్వేనియా అవెన్యూ 17వ వీధి సమీపంలో కాల్పులు సంఘటన చోటుచేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. అనుమానితుడి గురించి పోలీసులు ఆరాతీస్తున్నట్లు సమాచారం. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించలేదు.

Shooting near the White House

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: