గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ట్విట్టర్ స్టార్’

ట్రెండింగ్‌లో రెండో స్థానం రష్యా వ్యాక్సిన్ కన్నా ముందున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ కార్యక్రమానికి గుర్తింపు మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్‌లో 2వస్థానం ఆక్రమించి చరిత్ర సృష్టించింది. దేశంలోని ప్రముఖులు గ్రీన్‌ఇండియాఛాలెంజ్‌ను ట్విట్టర్ వేదిక లైక్‌లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70వేల ట్విట్టర్లతో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విజృంభించింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మూడేళ్లు చేసిన కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. సెలబ్రిటీలు, వివిధ […] The post గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ట్విట్టర్ స్టార్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ట్రెండింగ్‌లో రెండో స్థానం
రష్యా వ్యాక్సిన్ కన్నా ముందున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్
దేశవ్యాప్తంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ కార్యక్రమానికి గుర్తింపు

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్‌లో 2వస్థానం ఆక్రమించి చరిత్ర సృష్టించింది. దేశంలోని ప్రముఖులు గ్రీన్‌ఇండియాఛాలెంజ్‌ను ట్విట్టర్ వేదిక లైక్‌లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70వేల ట్విట్టర్లతో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విజృంభించింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మూడేళ్లు చేసిన కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకువస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అందరూ ఆశీర్వదిస్తున్నారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై నెటిజన్లు ప్రశంసల ఝల్లులు కురిపిస్తున్నారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ రాగానే పోటీపడి మొక్కలు నాటడం గమనార్హం. పర్యావరణ సమతూల్యం కోసం సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ మూడవదశలో దేశవ్యాప్తంగా విశేషంగా ప్రముఖులను, సెబ్రిటీలను అమితంగా ఆకట్టుకుంటుంది. సంతోష్‌కుమార్‌కు బాసటగా నిలుస్తున్నారు.

Green India Hashtag Trending on Twitter

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ట్విట్టర్ స్టార్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: