100మంది డ్యాన్సర్లకు ఆర్థిక సాయం

కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఛారిటీల ద్వారా సహాయం అందుతున్నప్పటికీ అది కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో ఇన్నాళ్లు ఇండస్ట్రీలో బాగా బ్రతికినోళ్లు కూడా నెలల తరబడి ఆదాయం లేకపోవడంతో వేరే మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే.. మరికొందరు సినీ కార్మికులు పండ్లు, కూరగాయలు […] The post 100మంది డ్యాన్సర్లకు ఆర్థిక సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఛారిటీల ద్వారా సహాయం అందుతున్నప్పటికీ అది కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో ఇన్నాళ్లు ఇండస్ట్రీలో బాగా బ్రతికినోళ్లు కూడా నెలల తరబడి ఆదాయం లేకపోవడంతో వేరే మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే.. మరికొందరు సినీ కార్మికులు పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సినీ ప్రముఖులు అలాంటి వారికి తమ పరిధి మేరకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ 100 మంది నృత్య కళాకారులకి అండగా నిలిచింది.

కాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా లేకపోవడంతో డ్యాన్సర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరి దీన స్థితిని అర్ధం చేసుకున్న కత్రినా కైఫ్ 100 మంది డ్యాన్సర్స్‌కి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వారికి కూరగాయల వ్యాపారం, టిఫిన్ సెంటర్స్ వంటివి పెట్టుకోవడానికి సహాయం చేశారు కత్రినా. ఇంతకు ముందు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 100 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లకు సాయం చేశారు. హృతిక్ స్పూర్తితో ఇప్పుడు కత్రినా కూడా వారిని ఆదుకుంది. కత్రినా చేసిన సహాయానికి డ్యాన్సర్స్ ఆమెకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఎప్పటిలాగే తిరిగి షూటింగ్స్ ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తుండటంతో.. అప్పటి వరకు చిన్న వ్యాపారాలతో తాత్కాలికంగా కష్టాల నుండి బయటపడతామని డ్యాన్సర్లు చెబుతున్నారు.

Katrina kaif financial support to 100 Dancers

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 100మంది డ్యాన్సర్లకు ఆర్థిక సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: