కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది

కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది ఆర్థికంగా పుంజుకుంటున్న దశలో కరోనా దెబ్బతీసింది రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయం న్యూఢిల్లీ: ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఈ సంక్షోభం తలెత్తక పోయి ఉంటే రానున్న ఏడెనిమిది ఏళ్లలో భారత్ ప్రపంచంలోని మూడు అగ్ర దేశాలలో ఒకటిగా మారి ఉండేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు […] The post కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది

ఆర్థికంగా పుంజుకుంటున్న దశలో కరోనా దెబ్బతీసింది
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయం

న్యూఢిల్లీ: ఆర్థికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొవిడ్-19 కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఈ సంక్షోభం తలెత్తక పోయి ఉంటే రానున్న ఏడెనిమిది ఏళ్లలో భారత్ ప్రపంచంలోని మూడు అగ్ర దేశాలలో ఒకటిగా మారి ఉండేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కనెకింగ్, కమ్యూనికేటింగ్ అండ్ చేంజింగ్ అనే పుస్తకాన్ని మంగళవారం రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికంగా బలపడుతున్న దశలో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు నిర్వర్తించడం మన అదృష్టమని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రతిష్టను ప్రపంచానికి బలంగా ఆయన చూపించగలిగారని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని దెబ్బతీయకుంటే వచ్చే ఏడెనిమిది సంవత్సరాలలో మన దేశమే ప్రపంచంలోని మూడు అగ్ర రాజ్యాలలో ఒకటిగా నిలిచేదని ఆయన అన్నారు. అయితే, కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న కారణంగా మనం అది సాధించగలమన్న నమ్మకం ఉందని రాజ్‌నాథ్ చెప్పారు.

ఈ పుస్తకం శీర్షిక వెంకయ్య నాయుడు తన జీవితంలో ఆచరించే సిద్ధాంతాలను తెలియచేస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. దేశం ముందు.. ఆ తర్వాత పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగత జీవితం అన్నది వెంకయ్య నాయుడు సిద్ధాంతమని ఆయన అన్నారు. ఈ పుస్తకంలో వెంకయ్య నాయుడు ఉపన్యాసాలు చాలా ఉన్నాయని, పాఠకులకు కొత్త జ్ఞానాన్ని ఇవి ప్రసాదించగలవని ఆయన చెప్పారు. వెంకయ్య నాయుడు హయాంలో పార్లమెంట్ సమావేశాలు ఎంతో ఫలప్రదంగా జరుగుతున్నాయని ఆయన కొనియాడారు. మూడేళ్ల పదవీకాలంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాధించిన విజయాలను వివరించే ఈ పుస్తకాన్ని రాజ్‌నాథ్ ఆవిష్కరించగా పుస్తకం ఎలెక్ట్రానిక్ వెర్షన్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ విడుదల చేశారు.

India could have been in top 3 Economic in 8 years: Rajnath singh

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కరోనా రాకుంటే మూడు అగ్రదేశాల్లో భారత్ ఉండేది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: