నేను వైసిపి వ్యక్తిని: జనసేన ఎంఎల్ఎ

అమరావతి: తూర్పుగోదావరి జనసేన రాజోలు ఎంఎల్ఎ రాపాక వరప్రసాద్ పార్టీపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన టికెట్‌పై గెలిచినప్పటికీ, వైఎస్సార్ సిపి ఇష్టమన్నారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. ‘నేను జనసేనలో చేరింది ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్నట్లు కానీ… బొంతు రాజేశ్వరరావుకు వైసిపి టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరానని ఆయన స్పష్టత ఇచ్చారు. తన ప్రయాణం వైఎస్‌ఆర్‌సిపితో మాత్రమే ఉందని రాపాక స్పష్టం చేశారు. జనసేన […] The post నేను వైసిపి వ్యక్తిని: జనసేన ఎంఎల్ఎ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: తూర్పుగోదావరి జనసేన రాజోలు ఎంఎల్ఎ రాపాక వరప్రసాద్ పార్టీపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను జనసేన టికెట్‌పై గెలిచినప్పటికీ, వైఎస్సార్ సిపి ఇష్టమన్నారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. ‘నేను జనసేనలో చేరింది ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్నట్లు కానీ… బొంతు రాజేశ్వరరావుకు వైసిపి టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరానని ఆయన స్పష్టత ఇచ్చారు. తన ప్రయాణం వైఎస్‌ఆర్‌సిపితో మాత్రమే ఉందని రాపాక స్పష్టం చేశారు. జనసేన పార్టీని బలహీన పార్టీ అని ఆయన అభివర్ణించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఓటమిపై వ్యాఖ్యానించారు.

నేను వైసిపి వ్యక్తినని రాపాక తెలిపారు. జనసేన ఓ వర్గానికి చెందిన పార్టీ అన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీకి ఉనికే ఉండదు. రాజోలు వైసిపిలోని మూడు వర్గాల్లో నాదో గ్రూపు. వైసిపిలో గ్రూపులు అంతం కావాలంటే జగన్ నిర్ణయం తీసుకోవాలి. జగన్ వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని గ్రూప్ ల వ్యవహారాన్ని పరిష్కరించాలి. కుమ్ములాటలు పార్టీకి మంచిది కాదు. త్వరలోనే పార్టీకి పుల్ స్టాప్. జనసేన గాలిపటంలా వచ్చిన పార్టీ. కేవలం పోటీలో ఉండాలి కాబట్టి జనసేనలో చేరా. పవన్ గెలవలేకపోవడానికి కారణం మిగితా కులాలు సహకరించకపోవడమే’ అని రాపాక స్పష్టం చేశారు. దీంతో జనసేనకు ఎకైక ఎంఎల్ఎ రాపాక దిమ్మతిరిగే షాకిచ్చినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నేను వైసిపి వ్యక్తిని: జనసేన ఎంఎల్ఎ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: