కరోనాతో రిజర్వ్‌ డిఎస్ పి కన్నుమూత

హైదరాబాద్ : కరోనా సోకి ఓ రిజర్వ్ డిఎస్ పి కన్నుమూశారు. ఇటీవల సదరు డిఎస్ పికి కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. 1996లో రిజర్వ్ సబ్ ఇనిస్పెక్టర్ గా ఆయన పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ జిల్లాలో సాయుధ రిజర్వ్ విభాగంలో పని చేస్తున్నారు. డిఎస్ పి మృతిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ […] The post కరోనాతో రిజర్వ్‌ డిఎస్ పి కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : కరోనా సోకి ఓ రిజర్వ్ డిఎస్ పి కన్నుమూశారు. ఇటీవల సదరు డిఎస్ పికి కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. 1996లో రిజర్వ్ సబ్ ఇనిస్పెక్టర్ గా ఆయన పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ జిల్లాలో సాయుధ రిజర్వ్ విభాగంలో పని చేస్తున్నారు. డిఎస్ పి మృతిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్‌ ఎస్ పి ఎన్ కోటిరెడ్డిలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. సదరు డిఎస్ పి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కరోనాతో రిజర్వ్‌ డిఎస్ పి కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: