వివాహేతర సంబంధం : నగరంలో మహిళ హత్య

హైద‌రాబాద్ : తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చిలుకానగర్ పరిధిలోని కుమ్మరికుంటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. నాచారం బాబానగర్ కు చెందిన రేణుక(30) అనే మహిళ చిలుకానగర్ కు చెందిన డ్రైవర్ అంజయ్యతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లడంతో అంజయ్య ఇంటికి రేణుక వెళ్లింది. ఈ క్రమంలో రేణుక, అంజయ్యల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన […] The post వివాహేతర సంబంధం : నగరంలో మహిళ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైద‌రాబాద్ : తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చిలుకానగర్ పరిధిలోని కుమ్మరికుంటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. నాచారం బాబానగర్ కు చెందిన రేణుక(30) అనే మహిళ చిలుకానగర్ కు చెందిన డ్రైవర్ అంజయ్యతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లడంతో అంజయ్య ఇంటికి రేణుక వెళ్లింది. ఈ క్రమంలో రేణుక, అంజయ్యల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అంజయ్య బీరు బాటిల్ తో రేణుక తలపై మోదాడు. అనంతరం రేణుక గొంతు పిసికి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం రేణుక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అంజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వివాహేతర సంబంధం : నగరంలో మహిళ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: