సెల్ ఫోన్ పేలి ముగ్గురు మృతి

చెన్నయ్ : సెల్ ఫోన్ పేలి ముగ్గరు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో మంగళవారం జరిగింది.  ముత్తులక్ష్మి(29) అనే మహిళను భర్త విడిచి పెట్టడంతో తన ఇద్దరు పిల్లలు రంజిత్(3), దీక్షిత్లతో కలిసి ఉంటోంది. ముత్తులక్ష్మి కూలీపనులు చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటోంది. కరోనా కారణంగా పనులు లేకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, కాల్ మాట్లాడుతోంది. ఒక్కసారిగా సెల్ ఫోన్ పేలిపోవడంతో మంటలు […] The post సెల్ ఫోన్ పేలి ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : సెల్ ఫోన్ పేలి ముగ్గరు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో మంగళవారం జరిగింది.  ముత్తులక్ష్మి(29) అనే మహిళను భర్త విడిచి పెట్టడంతో తన ఇద్దరు పిల్లలు రంజిత్(3), దీక్షిత్లతో కలిసి ఉంటోంది. ముత్తులక్ష్మి కూలీపనులు చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటోంది. కరోనా కారణంగా పనులు లేకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, కాల్ మాట్లాడుతోంది. ఒక్కసారిగా సెల్ ఫోన్ పేలిపోవడంతో మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో ముత్తులక్ష్మితో పాటు ఆమె కొడుకులు రంజిత్, దీక్షిత్ లు సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ముత్తులక్ష్మి, రంజిత్, దీక్షిత్ ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సెల్ ఫోన్ పేలి ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: