75వేలు దాటిన కరోనా కేసులు..

ఒకే రోజు 2207 పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలో 532, జిల్లాల్లో 1675 కేసులు వైరస్ దాడిలో మరో 12 మంది మృతి కోవిడ్‌తో భద్రాద్రి డిప్యూటి డిఎంహెచ్‌ఓ మరణం సంతాపం ప్రకటించిన మంత్రి ఈటల రాజేందర్ 601కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య 75,257కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు 75వేలు దాటాయి. గురువారం 23,495 టెస్టులు చేయగా, 2207 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 532 ఉండగా, ఆదిలాబాద్‌లో […] The post 75వేలు దాటిన కరోనా కేసులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఒకే రోజు 2207 పాజిటివ్‌లు
జిహెచ్‌ఎంసిలో 532, జిల్లాల్లో 1675 కేసులు
వైరస్ దాడిలో మరో 12 మంది మృతి
కోవిడ్‌తో భద్రాద్రి డిప్యూటి డిఎంహెచ్‌ఓ మరణం
సంతాపం ప్రకటించిన మంత్రి ఈటల రాజేందర్
601కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య
75,257కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు 75వేలు దాటాయి. గురువారం 23,495 టెస్టులు చేయగా, 2207 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 532 ఉండగా, ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి 82,జగిత్యాల 36, జనగాం 60, భూపాలపల్లి 29,గద్వాల 87, కామారెడ్డి 96, కరీంనగర్ 93, ఖమ్మం 85, ఆసిఫాబాద్ 21, మహబూబ్‌నగర్ 51, మహబూబాబాద్ 21, మంచిర్యాల 35, మెదక్ 32, మేడ్చల్ మల్కాజ్‌గిరి 136, ములుగు 20, నాగర్‌కర్నూల్ 36, నల్గొండ 28, నారాయణపేట్ 15, నిజామాబాద్ 89, పెద్దపల్లి 71, సిరిసిల్లా 25, రంగారెడ్డి 196, సంగారెడ్డి 37, సిద్ధిపేట్ 28, సూర్యాపేట్ 23, వికారాబాద్ 24, వనపర్తి 18, వరంగల్ రూరల్16, వరంగల్ అర్బన్ లో 142, యాదాద్రిలో మరో 23 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 12 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 75,257కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 53,239కి చేరింది.

ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 21,417మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 14,837మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 601కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కోవిడ్‌తో భద్రాద్రి డిప్యూటి డిఎంహెచ్‌ఓ మృతి..
కోవిడ్ వైరస్ దాడిలో భద్రాద్రి డిప్యూటి డిఎంహెచ్‌ఓ డా నరేష్ మరణించారు. మణుగూరు ఐసొలేషన్ సెంటర్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఇటీవల వైరస్ సోకింది. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే డాక్టర్ మరణం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. కరోన సోకిన వారం రోజుల్లోనే ఆయన మరణించడం చాలా బాధకరమని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపి, అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీనదయాల్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డా కళ్యాణ్ చక్రవర్తి, కోశాధికారి డా ప్రశాంత్‌లు తెలిపారు.
జిల్లాపేరు                       కేసుల సంఖ్య
ఆదిలాబాద్                     14
భద్రాద్రికొత్తగూడెం               82
జిహెచ్‌ఎంసి                     532
జగిత్యాల                        36
జనగాం                         60
జయశంకర్ భూపాలపల్లి        29
గద్వాల                          87
కామారెడ్డి                        96
కరీంనగర్                        93
ఖమ్మం                          85
ఆసిఫాబాద్                      21
మహబూబ్‌నగర్                 51
మహబూబాబాద్                21
మంచిర్యాల                      35
మెదక్                          32
మల్కాజ్‌గిరి                    136
ములుగు                       20
నాగర్‌కర్నూల్                  36
నల్గొండ                        28
నారాయణపేట్                  15
నిర్మల్                           6
నిజామాబాద్                   89
పెద్దపల్లి                         71
సిరిసిల్లా                        25
రంగారెడ్డి                       196
సంగారెడ్డి                       37
సిద్ధిపేట్                        28
సూర్యాపేట్                     23
వికారాబాద్                    24
వనపర్తి                        18
వరంగల్ రూరల్               16
వరంగల్ అర్బన్               142
యాదాద్రి                     23
మొత్తం 2207

Telangana Corona Cases tally Across 75000

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 75వేలు దాటిన కరోనా కేసులు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: