అమెరికాలో టిక్‌టాక్‌పై వేటు

వాషింగ్టన్: అమెరికాలో కూడా చైనా యాప్ టిక్‌టాక్‌పై వేటుపడింది. టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. టిక్‌టాక్‌తో పాటు విచాట్ నిషేధానికి కూడా ట్రంప్ ఉత్వర్వులు వెలువరించారు. ఇది కూడా చైనా యాప్. ఇటువంటి చైనా యాప్‌లతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని, అన్ని కోణాలలో పూర్తిగా విశ్లేషించుకుని చివరికి ఈ నిషేధానికి నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తమ ఉత్తర్వులలో తెలిపారు. అయితే ఈ నిషేధం 45 […] The post అమెరికాలో టిక్‌టాక్‌పై వేటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్: అమెరికాలో కూడా చైనా యాప్ టిక్‌టాక్‌పై వేటుపడింది. టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. టిక్‌టాక్‌తో పాటు విచాట్ నిషేధానికి కూడా ట్రంప్ ఉత్వర్వులు వెలువరించారు. ఇది కూడా చైనా యాప్. ఇటువంటి చైనా యాప్‌లతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని, అన్ని కోణాలలో పూర్తిగా విశ్లేషించుకుని చివరికి ఈ నిషేధానికి నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తమ ఉత్తర్వులలో తెలిపారు. అయితే ఈ నిషేధం 45 రోజులలో అమలులోకి వస్తుంది. భారతదేశంలో చాలా రోజుల క్రితమే టిక్‌టాక్ ఇతర చైనా యాప్‌లను నిషేధించారు. టిక్‌టాక్, విచాట్ బ్యాన్‌లకు సంబంధించి ట్రంప్ రెండు వేర్వేరు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇప్పుడు సంతకాలు చేశారు. జాతీయ భద్రతకు భంగకరం కారణంతోనే భారతదేశంలో కూడా అత్యంత పాపులర్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించారు. మొత్తం 106 చైనా యాప్‌లపై నిషేధించి భారతదేశం చైనాకు వ్యతిరేకంగా సాంకేతికంగా చర్యకు దిగిన తొలిదేశంగా నిలిచింది.

దీనిని ఇప్పుడు అమెరికా ఇతర దేశాలు అనుసరిస్తున్నాయి. చైనా యాప్‌ల నిషేధానికి భారతదేశం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే ట్రంప్ అధికార యంత్రాంగం, అమెరికా చట్టసభల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. టిక్‌టాక్ నిషేధానికి ఉత్తర్వులు వెలువరించిన ట్రంప్ సంబంధిత సమాచారాన్ని కాంగ్రెస్‌కు పంపించారు. ఇందులో చైనాకు చెందిన కంపెనీలు రూపొందించిన పలు మొబైల్ అప్లికేషన్స్ అమెరికాలో విస్తరించుకుపొయ్యాయని, వీటితో జాతీయ భద్రతకు తీరని ముప్పు వాటిల్లుతుందని తాము భావిస్తున్నట్లు, అదే విధంగా దేశ విదేశాంగ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదం తలెత్తుతుందని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు తాము సంతకం చేసిన ఉత్తర్వులు ఇప్పటి నుంచి 45 రోజుల వ్యవధిలో అమలులోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ఇతరకారణాలతో ఈ సమయం అవసరం అన్నారు. సంబంధిత చట్టవిభాగాలన్నీ కూడా టిక్‌టాక్ నిషేధానికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు.

టిక్‌టాక్ బ్యాన్ సరికాదేమో : ఫేస్‌బుక్
టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించడంపై ఫేస్‌బుక్ కార్యనిర్వాహక అధికారి మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. ఈ పరిణామం మంచిది కాదన్నారు. ఇప్పటి నిర్ణయంతో దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. నష్టమే ఎక్కువగా ఉంటుందని అన్నారు. కంపెనీ సమావేశంలో ఆయన టిక్‌టాక్ నిషేధం విషయం గురించిప్రస్తావించారు. టిక్‌టాక్ కొనుగోలుకు ఫేస్‌బుక్ సిద్ధం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఇప్పుడు దీనిపై తెలియచేయడం కుదరదని అన్నారు. అయితే తమకు పోటీదారుగా ఉన్న యాప్స్ ఇతర కంపెనీలను కూడా ఫేస్‌బుక్ ప్రభావితం చేసినట్లు భావిస్తున్నారు. సెప్టెంబర్ 15లోగా టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను అమెరికా కంపెనీ ఏదైనా నిర్వహిస్తే లేదా టిక్‌టాక్‌ను ఈ కంపెనీలు కొనుగోలు చేస్తే తనకు అభ్యంతరం లేదని ట్రంప్ చెప్పిన అంశాన్ని కూడా జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల నిర్వహణకు మైక్రోసాప్ట్ సంస్థ సంప్రదింపులు సాగిస్తున్నట్లు వెల్లడైంది. టిక్‌టాక్ యాప్‌తో భద్రతా సవాళ్లు ఉన్నాయని జుకర్‌బర్గ్ అంగీకరించారు. అయితే టిక్‌టాక్ తరహాలోనే వేరే దేశంలో ఫేస్‌బుక్ కూడా నిషేధానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో ఇప్పటికే ఫేస్‌బుక్‌పై ఆంక్షలు ఉన్నాయి.

ట్రంప్ ఆధిపత్య ధోరణే : చైనా

టిక్‌టాక్‌పై నిషేధానికి ట్రంప్ ఉత్తర్వుల పట్ల చైనా అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజింగ్‌లో శుక్రవారం దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్ స్పందించారు. అన్ని అంశాల్లోనూ ఆధిప్యత ధోరణిని ప్రదర్శిస్తూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు టిక్‌టాక్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. తమ దేశానికి చెందిన అన్ని కంపెనీలకు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తామని, అమెరికాలో టిక్‌టాక్ నిషేధ పరిణామాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు తమ కంపెనీలకు సహకరిస్తామని వెన్‌బిన్ తెలిపారు.

Trump issues order to ban Chinese App Tiktok

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అమెరికాలో టిక్‌టాక్‌పై వేటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: