ఆ బాలిక ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది: కేజ్రివాల్

న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలో మంగళవారం దారుణ అత్యాచారానికి గురయిన బాలిక ఎయిమ్స్‌లో ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం తెలిపారు. తాను ఆ బాలిక తల్లిదండ్రులతో, ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడానని ఆయన చెప్పారు. ‘నిన్న అత్యచారానికి గురయిన బాలిక తల్లిదండ్రులతో, డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడాను. నిన్న నేను ఆస్పత్రిలో ఆమెను చూశాను. ఆమె ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది. ఆమెను కాపాడడానికి డాక్టర్లు శాయశక్తులా కృషి చేస్తున్నారు. […] The post ఆ బాలిక ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది: కేజ్రివాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలో మంగళవారం దారుణ అత్యాచారానికి గురయిన బాలిక ఎయిమ్స్‌లో ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం తెలిపారు. తాను ఆ బాలిక తల్లిదండ్రులతో, ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడానని ఆయన చెప్పారు. ‘నిన్న అత్యచారానికి గురయిన బాలిక తల్లిదండ్రులతో, డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడాను. నిన్న నేను ఆస్పత్రిలో ఆమెను చూశాను. ఆమె ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది. ఆమెను కాపాడడానికి డాక్టర్లు శాయశక్తులా కృషి చేస్తున్నారు. దయచేసి ఆమె బతికి బయటపడాలని ప్రార్థించండి. ఈ సంఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు’ అని కేజ్రివాల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా బాలికకు మరో శస్త్ర చికిత అవసరమని, ఆమె పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆమెకు ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉందని, ఆస్పత్రిలోని న్యూరోసర్జరీ ఐసియులో చేర్చారని ఆ వర్గాలు తెలిపాయి. మంగళవారం పశ్చిమ ఢిల్లీలోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న 12బాలికపై 33ఏళ్ల కృష్ణన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక పదునైన ఆయుధంతో ఆమె ముఖంపైన తలపైన తీవ్రంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అంతటితో ఆగకుండా ఆమె మర్మాంగంలోకి పదునైన వస్తువును జొప్పించడంతో అవయవాలు ఛిద్రం అయ్యాయని, అందుకే ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయడం జరిగిందని ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. కాగా, పోలీసులు గురువారం కృష్ణన్‌ను అరెస్టు చేశారు.

kejriwal tweet on Delhi rape of minor condition

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆ బాలిక ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉంది: కేజ్రివాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: