‘ఎడ్జ్’ చూపిస్తానంటున్న శృతి..

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. కమల్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తండ్రి పేరును ఎక్కడ కూడా వాడుకోకుండానే మల్టీ టాలెంట్ హీరోయిన్ అంటూ నిరూపించుకుంది. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్‌గా కూడా శృతి ప్రతిభ చాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ లాక్ డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో ఈ అమ్మడు సంగీతంపై దృష్టి పెట్టింది. ‘ఎడ్జ్’ […] The post ‘ఎడ్జ్’ చూపిస్తానంటున్న శృతి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. కమల్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తండ్రి పేరును ఎక్కడ కూడా వాడుకోకుండానే మల్టీ టాలెంట్ హీరోయిన్ అంటూ నిరూపించుకుంది. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్‌గా కూడా శృతి ప్రతిభ చాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ లాక్ డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో ఈ అమ్మడు సంగీతంపై దృష్టి పెట్టింది. ‘ఎడ్జ్’ అనే ఒక మ్యూజిల్ వీడియోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా శృతి స్వయంగా ప్రకటించింది.‘ఎడ్జ్’ అనేది ఆమె సొంతంగా రూపొందిస్తున్న మ్యూజిక్ ఆల్బంలోని ఒక పాటగా చెబుతోంది. ఈ పాటకు ట్యూన్స్ తానే సమకూర్చడంతో పాటు వీడియో కూడా చేసిందట. ఈ వీడియో గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ…“సంగీతం నా జీవితంలో భాగమైనందుకు నేను అదృష్టవంతురాలిని. ‘ఎడ్జ్’ అనేది ప్రతి ఒక్కరిలోని అసంపూర్ణమైన ప్రేమను తెలియజేసే ప్రయత్నం. మీరు ఇతరుల్లో మంచితనం చూడాలి. మిమ్మల్ని మీరు నిజంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాలి”అని పేర్కొంది. ‘ఎడ్జ్’ను శనివారం విడుదల చేస్తున్నట్లు శృతిహాసన్ పేర్కొంది.

Shruti Haasan set to release Edge Music Track

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ‘ఎడ్జ్’ చూపిస్తానంటున్న శృతి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: