బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్ అవే

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఆగస్టు 9 పండగ రోజు అని చెప్పాలి. ఆ రోజున మహేష్ 44 ఏళ్లు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే సూపర్‌స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ ప్రారంభించేశారు. బర్త్ డే కామన్ డీపీని నేషనల్ వైడ్ ట్రెండ్ చేసి రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా ‘ఫ్యాన్స్ వేడుకలు జరుపొద్దని.. దేశంలో కరోనా విజృంభిస్తోన్నందున అందరూ సామూహిక వేడుకలకు దూరంగా […] The post బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్ అవే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఆగస్టు 9 పండగ రోజు అని చెప్పాలి. ఆ రోజున మహేష్ 44 ఏళ్లు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే సూపర్‌స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ ప్రారంభించేశారు. బర్త్ డే కామన్ డీపీని నేషనల్ వైడ్ ట్రెండ్ చేసి రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా ‘ఫ్యాన్స్ వేడుకలు జరుపొద్దని.. దేశంలో కరోనా విజృంభిస్తోన్నందున అందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలి’ అని మహేష్ తన ఫ్యాన్స్ ని కోరారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియాలోనే మహేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బర్త్ డే ట్రెండ్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం 63 మిలియన్ ట్వీట్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

కాగా, మహేష్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు. మహేష్, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ’సర్కారు వారి పాట’ మూవీ నుంచి మహేష్ వాయిస్ మెసేజ్, టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయనున్నట్టు తెలిసింది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే మహేష్ ఓ మైక్ ముందు కూర్చున్న స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ‘రెడీగా ఉన్నారా’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సూపర్‌స్టార్ అభిమానులకు ‘సర్కారు వారి పాట’ టీమ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఇవ్వనున్నారని స్పష్టమైంది. అంతేకాకుండా ‘సర్కారు వారి పాట’ నుంచి మరో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. దీంతో పాటు సూపర్ స్టార్ నెక్స్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Mahesh babu’s birthday gifts to Fans on Aug 9

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్ అవే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: