ఆరు గెటప్‌లలో తారక్!

ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర ఉద్యమ కాలం కథతో సాగుతుంది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి పాత్రలో కనిపించనుండగా కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బ్రిటీష్‌వారిని ముప్పు తిప్పలు పెట్టే పాత్ర కొమురం భీమ్. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తాడని తెలిసింది. కొమురం భీమ్ పాత్రకు గాను తారక్ ముఖ్యంగా ఆరు గెటప్స్ […] The post ఆరు గెటప్‌లలో తారక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర ఉద్యమ కాలం కథతో సాగుతుంది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి పాత్రలో కనిపించనుండగా కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బ్రిటీష్‌వారిని ముప్పు తిప్పలు పెట్టే పాత్ర కొమురం భీమ్. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తాడని తెలిసింది. కొమురం భీమ్ పాత్రకు గాను తారక్ ముఖ్యంగా ఆరు గెటప్స్ లో కనిపిస్తాడట. ఆ ఆరు గెటప్స్ లో కూడా ఎన్టీఆర్ అభిమానులను అలరించే విధంగా ఉంటాడని అంటున్నారు. పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆయన చేసే సాహసాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట.

నటుడిగా ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఎన్టీఆర్ ఈ చిత్రంతో గెటప్స్ పరంగా ఈతరం హీరోల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఏ ఒక్కరు కూడా రెండు మూడు గెటప్స్ వేసింది లేదు. ఒక్క సినిమాలో ఆరు విభిన్నమైన గెటప్స్ లో కనిపించడం అంటే రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు. ఖచ్చితంగా ఈ స్టార్ హీరో పాత్ర చరిత్రలో నిలిచి పోయేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.

Jr NTR to be seen in 6 Getup in RRR movie

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆరు గెటప్‌లలో తారక్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: