ప్రీ వెడ్డింగ్ బాష్

బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు పలుకుతూ తాను ప్రేమించిన మిహికా బజాజ్‌ని పెళ్లాడబోతున్నాడు రానా. బంగారు వజ్రాభరణాల వ్యాపారం, ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే మిహికా విక్టరీ వెంకటేష్ కుమార్తెకు క్లోజ్ ఫ్రెండ్. ఆ క్రమంలోనే రానాకు ఆమె సన్నిహితంగా మారింది. అటుపై చాలా కాలం స్నేహం తర్వాత ప్రేమ మొగ్గ తొడిగిన సంగతిని రానా ఇటీవల వెల్లడించాడు. ఇక రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్టు 8న హైదరాబాద్ లో […] The post ప్రీ వెడ్డింగ్ బాష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు పలుకుతూ తాను ప్రేమించిన మిహికా బజాజ్‌ని పెళ్లాడబోతున్నాడు రానా. బంగారు వజ్రాభరణాల వ్యాపారం, ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే మిహికా విక్టరీ వెంకటేష్ కుమార్తెకు క్లోజ్ ఫ్రెండ్. ఆ క్రమంలోనే రానాకు ఆమె సన్నిహితంగా మారింది. అటుపై చాలా కాలం స్నేహం తర్వాత ప్రేమ మొగ్గ తొడిగిన సంగతిని రానా ఇటీవల వెల్లడించాడు. ఇక రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్టు 8న హైదరాబాద్ లో జరుగనుంది. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు హాజరు కానున్నారు. ఇక ఈ వివాహానికి ముందు ఉత్సవాలు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఇరు కుటుంబాలు వరుసగా పెళ్లికొడుకుని చేసే ఉత్సవం.. మాతా కి చౌకి వేడుకలను నిర్వహించారు.

ప్రీ వెడ్డింగ్ బాష్‌లో రానా, మిహికాలు అందంగా ముస్తాబై కనువిందుచేశారు. ముఖ్యంగా మిహికా మెరిసే డిజైనర్ వస్త్రాల్లో తళుకులీనింది. ఇక, పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె నివాసాలు వివాహ వేడుక కోసం అలంకరణలతో దివ్యమైన కాంతులతో శోభిల్లుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ కూడా రంగురంగుల అలంకరణతో ఎంతో వైభవంగా కనిపిస్తోంది. అద్భుతమైన లైటింగుతో అలంకరించబడి ఈ స్టూడియో పెళ్లికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 8న రానా, మిహికాల వివాహం కోసం రామానాయుడు స్టూడియోస్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Rana and Miheeka Bajaj’s Pre Wedding Ceremony

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రీ వెడ్డింగ్ బాష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: