ఎంఎస్‌ఎంఇలకు పూచీకత్తు లేని రుణాలు అందించాలి: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మధ్య (ఎంఎస్‌ఎంఇ) తరహా పరిశ్రమలకు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ క్రింద పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆత్మ నిర్బర్ అభియాన్ ప్యాకేజిపై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, ఎక్కవ మందికి లబ్ధి చేకూర్చే విధంగా […] The post ఎంఎస్‌ఎంఇలకు పూచీకత్తు లేని రుణాలు అందించాలి: సిఎస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మధ్య (ఎంఎస్‌ఎంఇ) తరహా పరిశ్రమలకు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ క్రింద పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆత్మ నిర్బర్ అభియాన్ ప్యాకేజిపై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, ఎక్కవ మందికి లబ్ధి చేకూర్చే విధంగా జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలలోని పరిశ్రమల శాఖ, జిల్లా మేనేజర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్లతో తరచు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. రుణాలు అంధించేందుకు రాష్ట్రాలకు ఎలాంటి పరిమితి లేనందున వీలైనంత సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడంపై కలెక్టర్లు పెద్దఎత్తున దృష్ఠి సారించాలని ఆదేశించారు.

ఆధీన రుణ కెడిట్ హామీ పథకం(Credit Guarantee Scheme for Subordinate debt) క్రింద అర్హత ఉన్న సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల జాబితను అందించాలని బ్యాంకర్లను కోరారు. బ్యాంకర్లు తమకు కేటాంయించిన లక్ష్యాల మేరకు రుణాలు అంధించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమీషనర్ మణిక్ రాజ్, సంచాలకులు ఎన్. సత్యనారయణతో పాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Provide unsecured loans to MSMEs: CS Somesh Kumar

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఎంఎస్‌ఎంఇలకు పూచీకత్తు లేని రుణాలు అందించాలి: సిఎస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: