రూ.400 కోట్లు మంజూరు

సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్ అండ్ బి ఒకటి, రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్న అధికారులు ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని సంస్థ ప్రతినిధులతో అధికారుల భేటీ మనతెలంగాణ/హైదరాబాద్: సమీకృత కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం కొత్త సచివాలయ భవనం తుది నమూనాకు బుధవారం ఆమోద ముద్ర వేసిన […] The post రూ.400 కోట్లు మంజూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్ అండ్ బి
ఒకటి, రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్న అధికారులు
ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని సంస్థ ప్రతినిధులతో అధికారుల భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్: సమీకృత కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం కొత్త సచివాలయ భవనం తుది నమూనాకు బుధవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవన నిర్మాణానికి గురువారం రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు చెన్నైకు చెందిన ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
తదుపరి కార్యాచరణపై సమాలోచనలు
తదుపరి కార్యాచరణపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. కొత్త సచివాలయ భవనంలో మార్పులు చేర్పులను కెసిఆర్ ఇటీవల వరుస సమీక్షలు నిర్వహించి సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిపుణులు ఖరారు చేసిన తుది డిజైన్‌ను సైతం కేబినెట్‌లో ఆమోదించారు. అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా సకల సౌకర్యాలూ ఉండేలా చూడాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, సమావేశాల కోసం మీటింగ్ హాల్, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని కెసిఆర్ సూచించిన నేపథ్యంలో నూతన సచివాలయం రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా నిర్మాణం జరగనుందని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రతిష్ట, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా…
తెలంగాణ ప్రతిష్ట, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా కొత్త సచివాలయం నిర్మాణం కానుంది. ‘అర్కిటెక్టులు ఆస్కార్, పొన్నితోపాటు ఇంజినీర్స్ సత్యవాణి ప్రాజెకట్స్ అండ్ కన్సల్టేషన్ ఈ డిజైన్‌ను రూపొందించింది. మొత్తం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 7 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. గతంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని భావించినా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌లో మార్పులు చేశారు. తాజా డిజైన్ ప్రకారం 7 అంతస్తులకు పైన భవనం మధ్య భాగంలో సెంట్రల్ టవర్ ఉంటుంది. ఇందులో మరో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తుతో ఉంటుంది. సెంట్రల్ టవర్‌పై 48 అడుగుల ఎత్తుతో తూర్పు, పడమరవైపు ‘స్కైలాంజ్’లు నిర్మించనున్నారు. వీటిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం (డోమ్) ఉంటుంది. ఈ డోమ్‌పై 11 అడుగుల ఎత్తుతో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు.
నూతన సచివాలయ నిర్మాణం, దానికి సంబంధించిన వివరాలు
ఉపరితలం నుంచి జాతీయ చిహ్నం వరకు భవనం ఎత్తు  : 278 అడుగులు
భవనం పొడవు, వెడల్పు                                  : 600×300 అడుగులు
సచివాలయం మొత్తం విస్తీర్ణం                              : 27.5 ఎకరాలు
భవనం, ఇతర వసతుల కోసం వినియోగించేది             : 23.5 ఎకరాలు.
చుట్టూ రోడ్ల కోసం                                          : 3 ఎకరాలు
భవనానికి 9.7 శాతమే
భవనం విస్తీర్ణం                                              : 2.4 ఎకరాలు (మొత్తం స్థలంలో 9.7 శాతం)
ల్యాండ్ స్కేపింగ్                                             : 12 ఎకరాలు (50 శాతం)
అంతర్గత రోడ్లు, ఫుట్‌పాత్‌లు                                : 6 ఎకరాలు (25 శాతం)
పార్కింగ్                                   : 3.7 ఎకరాలు (15.3శాతం) (650 కార్లు, 500 బైక్‌లు పార్క్ చేయవచ్చు)
సెంట్రల్ కోర్ట్‌యార్డ్ లాన్                                      : 2.2 ఎకరాలు (9శాతం)
భవనంలో వెలుపలా ఇలా..
ఏడు ఫ్లోర్లు + లాబీలు                                       : 6 లక్షల చదరపు అడుగులు
సెంట్రల్ టవర్‌లోని మీటింగ్ హాళ్లు, స్కైలాంజ్                : 52 వేల చదరపు అడుగులు
ఇతర సౌకర్యాలు                                             : 48వేల చదరపు అడుగులు
మొత్తం                                                       : 7 లక్షల చదరపు అడుగులు
సకల వసతులు
ఉద్యోగుల కోసం ప్రతి అంతస్తులో భోజన గది. రికార్డులు, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్, బిల్డింగ్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలకు సరిపడా స్థలం. సచివాలయం ఆవరణలో ఒక బ్యాంకు, ఏటిఎం, మందుల దుకాణం, పిల్లలు ఆడుకునే స్థలం, క్యాంటిన్, పెట్రోల్ బంక్, ఫైర్‌స్టేషన్, వెయిటింగ్ హాల్స్‌తో పాటు కొత్త దేవాలయం, మసీదులను నిర్మించనున్నారు.

TS Govt Grants rs 400 Cr for new Secretariat Building

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రూ.400 కోట్లు మంజూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: