ట్రంప్ దురాలోచన!

            అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ సందేశం అమెరికన్లను ఆశ్చర్యచకితులను చేసింది. దేశ చరిత్రలో ఎన్నడూ వినని ఎన్నికల వాయిదా డిమాండ్ ప్రజాస్వామ్య వధ కిందకే వస్తుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్వయంగా దేశాధ్యక్షుడే ఈ సూచన చేయడం అందరినీ విస్మయపరుస్తున్నది. గతంలో ఎప్పుడూ, ఎంతటి కష్టకాలంలోనూ ఇటువంటి అభిప్రాయాన్ని ఏ అధ్యక్షుడూ వ్యక్తం చేయలేదు. 1845లో అమెరికా పార్లమెంటు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా నిర్ణయం […] The post ట్రంప్ దురాలోచన! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

            అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ సందేశం అమెరికన్లను ఆశ్చర్యచకితులను చేసింది. దేశ చరిత్రలో ఎన్నడూ వినని ఎన్నికల వాయిదా డిమాండ్ ప్రజాస్వామ్య వధ కిందకే వస్తుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్వయంగా దేశాధ్యక్షుడే ఈ సూచన చేయడం అందరినీ విస్మయపరుస్తున్నది. గతంలో ఎప్పుడూ, ఎంతటి కష్టకాలంలోనూ ఇటువంటి అభిప్రాయాన్ని ఏ అధ్యక్షుడూ వ్యక్తం చేయలేదు. 1845లో అమెరికా పార్లమెంటు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నాలుగేళ్ల కొకసారి, ఆ సంవత్సరం నవంబర్ నెల తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు జరుగుతున్నాయి. అవి ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన జరగవలసి ఉంది. అందుకు ఇంకా 4 మాసాలు గడవాలి.

కరోనా వైరస్ అమెరికాలో క్రూర విహారం చేస్తున్నది. దాని వల్ల ఇప్పటికే అక్కడ 1,50,000 మంది చనిపోయారు. ఈ మృత్యు హేల నిరాటంకంగా కొనసాగుతున్నది. అందుచేత ఎన్నికల వాయిదాయే తరణోపాయమని ట్రంప్ అంటున్నాడు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయడం వారికి క్షేమకరం కాదని ఆయన వాదన. ప్రత్యామ్నాయంగా ఉన్న పరోక్ష (మెయిల్ ద్వారా ఓటు వేయడం) ఓటింగ్ వల్ల మోసాలు జరుగుతాయంటున్నాడు. ఫలితాల వెల్లడికి చాలా కాలం పడుతుందని చెబుతున్నాడు. అయితే గతంలో అంతర్యుద్ధ కాలంలో, ఇటువంటి వైరస్‌లు విజృంభించినప్పుడు, ప్రపంచ యుద్ధాల్లోనూ ఎన్నికలు వాయిదా పడలేదని విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. 1864లో భీషణ అంతర్యుద్ధం నడుమ, తాను ఓడిపోబోతున్నాననే నైరాశ్య భావన అలముకున్నప్పటికీ రిపబ్లికన్ పార్టీకే చెందిన మహా నేత అబ్రహాం లింకన్ స్వయంగా అధ్యక్ష పదవిలో ఉండి కూడా ఎన్నికలను వాయిదా వేయించలేదు.

మరి డోనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడెందుకీ దుర్బుద్ధి కలిగింది? వాస్తవానికి ట్రంప్ ఎన్నికల జాతకం బొత్తిగా బాగోలేదు. అన్ని మచ్చు పోలింగులలోనూ, ప్రజాభిప్రాయ సేకరణల్లోనూ వెనుకబడి ఉన్నాడు. తన పార్టీకి ఎదురు లేదన్న రాష్ట్రాల్లోనూ కింది చేయిగా ఉన్నాడు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, సకాలంలో దాని ప్రమాదాన్ని ఊహించి ముందు జాగ్రత్తలు తీసుకోడంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కరోనా నేపథ్యంలోనే కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నది. తాజా త్రైమాసికం (2020 ఏప్రిల్ జూన్) లో 33 శాతం మేరకు పడిపోయింది. నిరుద్యోగం 14.7 శాతానికి పెరిగిపోయింది. 1947 తర్వాత మొట్టమొదటి సారిగా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 34.1 శాతం పతనాన్ని చవిచూసింది. అన్ని ఆర్థిక కార్యకలాపాలు మూతపడడంతో ప్రజల వినిమయ వ్యయం ఘోరంగా దిగజారిపోయింది.

ఈ పరిస్థితి సహజంగానే ట్రంప్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బ తీసింది. తాను ఓడిపోతానని తెలిసి ఎన్నికలను వాయిదా వేయాలని సూచించడం ఓటమి భయాన్నే కాదు, నాయకత్వ ఔన్నత్యం బొత్తిగాలేనితనాన్ని కూడా చాటుతున్నది. ట్రంప్ తన దాదాపు నాలుగేళ్ల పదవీ కాలంలో ప్రపంచ నాయకురాలుగా అమెరికాకు గల పేరును భ్రష్టు పట్టించాడు. విశ్వమానవాళి హితం కోరి కుదుర్చుకున్న పారిస్ పర్యావరణ ఒప్పందం వంటి వాటి నుంచి ఉపసంహరించుకునేలా చేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు మద్దతు నిలిపివేశాడు. పూర్తి జాతీయోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాడు. దానిని అభిమానించే ఓటర్లున్నారనే అభిప్రాయంతో, వారి మద్దతుపై భరోసాతో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇంతటి దుస్సాహసి ఓటమి భయం కలగడంతోనే దేశం చిరకాలంగా పాటిస్తున్న ఒక ఘన ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని మంటలో గలపాలని చూడడం కంటే దుర్వూహం, దురూహ ఏముంటాయి! ఈయన ఈ కుతంత్రానికి పాల్పడతాడని, ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తాడని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఏప్రిల్‌లోనే జోస్యం చెప్పాడు.

అప్పుడు ట్రంప్, ఆయన అనుచర గణం దానిని తీవ్రంగా ఖండించారు. పరోక్ష ఓటింగ్‌లో దొంగ ఓట్లు పడతాయని ట్రంప్ చూపిస్తున్న బూచి హేతు విరుద్ధమైనది. అమెరికా ఎన్నికల్లో దొంగ ఓటింగ్ అత్యంత అరుదు. 2000వ సంవత్సరం నుంచి అక్కడ వివిధ సందర్భాల్లో 25 కోట్ల పరోక్ష ఓట్లు పడ్డాయి. అందులో మోసపు ఓట్లు 1288 మాత్రమేనని సమాచారం. అందుకుగాను 1100 మందికి శిక్షలు పడ్డాయి. ప్రస్తుత ఎన్నికల ప్రైమరీలలో 5 రాష్ట్రాలు పరోక్ష ఓటింగ్‌నే ఆశ్రయించాయి. ఈ పద్ధతిలో ఓటర్లందరికీ మెయిల్ ద్వారా ఓటు పత్రాలు పంపుతారు. వారు ఉన్న చోటి నుంచే వాటిని సవ్యంగా పూర్తి చేసి తిరిగి పంపాలి. ఇంతకీ ట్రంప్ చేస్తున్న ఈ వికృత యోచన ఆచరణకు నోచుకునే అవకాశం బొత్తిగా లేదు. అది జరగాలంటే అక్కడి ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం తెలపాలి. ప్రతినిధుల సభ డెమొక్రాట్ల తిరుగులేని ఆధిక్యంలో ఉంది.

Trump suggests delay to US presidential election

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ట్రంప్ దురాలోచన! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: