నేను చెడ్డవాడిని కాదు, వదిలేయండి

  మినియాపొలిస్ పోలీసులను వేడుకున్న జార్జి ఫ్లాయిడ్ ఇద్దరు పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కేసు విచారణలో భాగంగా వీడియో చూడడానికి జర్నలిసులకు జడ్జి అనుమతి మినియాపొలిస్: అమెరికాలో మినియా పొలిస్ పోలీసుల క్రూరత్వానికి నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పయిన విషయంతెలిసిందే. ఈ ఉదంతం అమెరికావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు, విధ్వంసకాండకు దారితీసింది కూడా. ష్లాయిడ్ మృతికి కారణమైన నలుగురు పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసులు కూడా నమోదు చేయడం కూడా […] The post నేను చెడ్డవాడిని కాదు, వదిలేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మినియాపొలిస్ పోలీసులను వేడుకున్న జార్జి ఫ్లాయిడ్
ఇద్దరు పోలీసుల బాడీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
కేసు విచారణలో భాగంగా వీడియో చూడడానికి జర్నలిసులకు జడ్జి అనుమతి

మినియాపొలిస్: అమెరికాలో మినియా పొలిస్ పోలీసుల క్రూరత్వానికి నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పయిన విషయంతెలిసిందే. ఈ ఉదంతం అమెరికావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు, విధ్వంసకాండకు దారితీసింది కూడా. ష్లాయిడ్ మృతికి కారణమైన నలుగురు పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసులు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. కాగా చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు తనను బలవంతంగా కారులోకి నెట్టడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులను తాను చెడ్డవాడిని కాదంటూ ఫ్లాయిడ్ వేడుకుంటున్న వీడియో దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఫ్లాయిడ్‌ను క్రూరంగా నేలకు అదిమిపెట్టి గొంతుమీద కాలుతో బలంగా నొక్కడంతో అతను ఊపిరాడక చనిపోయిన విషయం తెలిసిందే.

ఫ్లాయిడ్‌ను బలవంతంగా లాక్కుని వెళ్లడానికి యత్నించిన ఇద్దరు పోలీసు అధికారుల బాడీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ‘ నేను చెడ్డవాడిని కాదు. నాకు కరోనా వచ్చింది. మళ్లీ ఆ స్థితికి వెళ్లాలనుకోవడం లేదు. నన్ను వదిలిపెట్టండి’ అని ఫ్లాయిడ్ పోలీసు అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు ఆ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదంతా చూస్తున్న దారిన వెళ్లే వ్యక్తి ‘నువ్వు పెనుగులాడవద్దు. నువ్వు గెలవలేవు’ అని ఫ్లాయిడ్‌తో చెప్పగా, ‘నేను గెలవాలని అనుకోవడం లేదు’ అని ఫ్లాయిడ్ అనడం కూడా ఆ కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే పోలీసులు అతడి ముఖాన్ని బలవంతంగా నేలకు అదిమిపెట్టి మెడపై కాలుతో నొక్కిపెట్టడంతో ‘నాకు ఊపిరాడడం లేదు’ అని ఫ్లాయిడ్ చిన్నపాటి గొంతుతో అరవడం కూడా అందులో ఉంది.

థామస్ లేన్, జె. కుయెంగ్ అనే ఇద్దరు పోలీసు అధికారులకు చెందిన బాడీ కెమెరాల్లో ఇదంతా రికార్డయింది. గత మే 25న డెరెక్ చావిన్ అనే పోలీసు అధికారి దాదాపు ఎనిమిది నిమిషాలపాటు ఫ్లాయిడ్ గొంతుపై కాలుతో నొక్కిపెట్టడం వల్ల ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. చావిన్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేయగా, అతనికి సహకరించిన నేరానికి మరో ముగ్గురు పోలీసులు లేన్,కుయెంగ్ , టౌ థావుపైనా కేసు నమోదయింది. ఫ్లాయిడ్ మృతి చెందిన ఒక రోజు తర్వాత ఈ నలుగురినీ ఉద్యోగాలనుంచి తొలగించారు కూడా. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం నాడు జర్నలిస్టులు, ఇతర పౌరసంఘాల సభ్యులను ఈ వీడియో చూడడానికి అనుమతించారు. అయితే ఈ వీడియో ప్రసారానికి మాత్రం జడ్జి అనుమతించలేదు.

New bodycam footage reveals George Floyd words

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నేను చెడ్డవాడిని కాదు, వదిలేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: