కోరలు చాస్తున్న కోవిడ్ మహమ్మారి

  ఒక్క రోజే రికార్డు స్థాయిలో 32,695 కేసులు,606 మరణాలు 48 శాతం కేసులు రెండు రాష్ట్రాల్లోనే మహారాష్ట్ర మాజీ సిఎంకు పాజిటివ్ బీహార్ రాజ్‌భవన్‌కూ వైరస్ సెగ రాష్ట్ర బిజెపి అధ్యక్షడికి, భార్య, తల్లికీ సోకిన వైరస్ కేసుల్లో గుజరాత్‌ను దాటేసిన కర్నాటక పంజాబ్ మంత్రి భార్య, కుమారుడికి కూడా న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఊహించని రీతిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా […] The post కోరలు చాస్తున్న కోవిడ్ మహమ్మారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక్క రోజే రికార్డు స్థాయిలో 32,695 కేసులు,606 మరణాలు
48 శాతం కేసులు రెండు రాష్ట్రాల్లోనే
మహారాష్ట్ర మాజీ సిఎంకు పాజిటివ్
బీహార్ రాజ్‌భవన్‌కూ వైరస్ సెగ
రాష్ట్ర బిజెపి అధ్యక్షడికి, భార్య, తల్లికీ సోకిన వైరస్
కేసుల్లో గుజరాత్‌ను దాటేసిన కర్నాటక
పంజాబ్ మంత్రి భార్య, కుమారుడికి కూడా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఊహించని రీతిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,695 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,876కు చేరుకుంది. దేశంలో కరోనా వెలుగు చూసినపటినుంచి ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు బైటపడ్డం ఇదే తొలిసారి.

అంతేకాకుండా గత 24 గంటల్లో దేశంలో కరోనా బారిన పడి 606 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,915కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షోమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్త బాధితుల్లో ఇప్పటివరకు 6,12,814 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లగా 3,31,146 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 63.25 శాతం కోవిడ్ బాధితులు కోలుకున్నారని, యాక్టివ్ కేసులకన్నా కోలుకున్న వారి సంఖ్య 2,81,668 ఎక్కువగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

15 రోజుల్లో 3,83,000 కేసులు
జూలై నెల ప్రారంభంనుంచి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత జూన్ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల కేసులు బయటపడగా ఈ నెలలో కేవలం 15 రోజుల్లోనే 3,83,000 కేసులు వెలుగు చూశాయి. అంతే కాకుండా ఈ 15 రోజుల్లోనే 7515 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని మొత్తం కేసుల్లో 48 శాతానికి పైగా కేసులు కేవలం రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడులోనే నమోదయ్యాయని, పది రాష్ట్రాల్లోనే మొత్తం కేసుల్లో 84.62 శాతం కేసులు వెలుగు చూశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా బుధవారం వరకు మొత్తం 1,27,39,490 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగిందని, నిన్న ఒక్క రోజే 3,26,826 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలిపింది.

కాగా దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికే వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,75,640 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 10,928 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రాష్ట్రంలో మరో 233 మంది చనిపోయారు. ఢిల్లీలో 3487మంది, తమిళనాడులో 2,167 మంది, గుజరాత్‌లో 2,079 మంది, యుపిలో 1,012 మంది, పశ్చిమ బెంగాల్‌లో వెయ్యిమంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. కాగా గత కొన్ని రోజులుగా కర్నాటకలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్రం మొత్తం కేసులు విషయంలో గుజరాత్ రాష్ట్రాన్ని దాటేసింది. కర్నాటకలో మొత్త కేసుల సంఖ్య 47,253కు చేరుకోగా, గుజరాత్‌లో ఈ సంఖ్య 44,552గా ఉంది.

మహారాష్ట్ర మాజీ సిఎంకు కరోనా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నీలంగేకర్ (88)కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను లాతూర్ జిల్లానుంచి పుణెలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.1985 86మధ్య నీలంగేకర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.

బీహార్ రాజ్‌భవన్‌కూ సెగ
గత కొన్ని రోజులుగా బీహార్ రాష్ట్రంలో కరోనా శరవేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర బిజెపి కార్యాలయాన్ని కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించగా, తాజాగా రాజ్‌భవన్‌కు కూడా వైరస్ సెగ తగిలింది. ఇప్పటికే 20 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరికొంత మంది ఫలితాలు రావలసి ఉంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బీహార్‌లో ఈ నెల16నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర బిజెపి కార్యాలయంలో పలువురు కార్యకర్తలు ఇప్పటికే కరోనా బారిన పడగా తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్‌తో పాటుగా ఆయన భార్య, తల్లికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా ప్రకటించారు.

మంత్రి భార్య, కుమారుడికీ పాజిటివ్
పంజాబ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ట్రిప్ట్ రజీందర్ సింగ్ బాజ్వా(77) భార్య, కుమారుడికి కూడా కరోనా సోకింది. మంత్రికి కోవిడ్19 సోకిన రెండు రోజలు తర్వాత నిర్వహించిన పరీక్షల్లో బాజ్వా భార్య, కుమారుడికి కూడా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కోవిడ్19 నోడల్ అధికారి డాక్టర్ రాజేష్ భాస్కర్ నిర్ధారించారు. ఇద్దరికీ పెద్దగా వైరస్ లక్షణాలు లేనప్పటికీ క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు.

32,695 new cases, 606 deaths in last 24 hours

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కోరలు చాస్తున్న కోవిడ్ మహమ్మారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.