ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం: తలసాని

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ఉస్మానియా ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపి నేతలపై మంత్రి తలసాని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ 2015లోనే ఉస్మానియాను సందర్శించారని, కొత్త భవనాన్ని నిర్మించాలని ఆదేశాలిస్తే కొంత మంది కోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. ఆనాడు స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్న వారే ఇప్పుడు ఉస్మానియాలోకి నీళ్లు వచ్చాయంటూ రాద్ధాంతం […] The post ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం: తలసాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ఉస్మానియా ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపి నేతలపై మంత్రి తలసాని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ 2015లోనే ఉస్మానియాను సందర్శించారని, కొత్త భవనాన్ని నిర్మించాలని ఆదేశాలిస్తే కొంత మంది కోర్టుకు వెళ్లారని ధ్వజమెత్తారు. ఆనాడు స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్న వారే ఇప్పుడు ఉస్మానియాలోకి నీళ్లు వచ్చాయంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియాలో డ్రైనేజ్ సమస్యను ఇప్పటికే పరిష్కరించామన్నారు. కోర్టుకు వెళ్లి అడ్డుపుల్లలు, అడ్డు కాళ్లు వేసినవాళ్లు ఇప్పుడు ఉస్మానియాలో జరగనిది జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ప్రతిపక్షాలను తలసాని ప్రశ్నించారు.

The post ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం: తలసాని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: