ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి ఆరో స్థానం..

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలో ఆరో ఎతిపెద్ద ధనవంతుడు అయ్యారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం, ముకేశ్ ఇప్పుడు గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ని కూడా అధిగమించాడు. ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తులు ఇప్పుడు 72.4 బిలియన్ డాలర్లు. అంతకుముందు జూన్‌లో ముకేశ్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 7వ స్థానంలో ఉన్న హాత్వే బెర్క్‌షైర్‌కు చెందిన […] The post ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి ఆరో స్థానం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలో ఆరో ఎతిపెద్ద ధనవంతుడు అయ్యారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం, ముకేశ్ ఇప్పుడు గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ని కూడా అధిగమించాడు. ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తులు ఇప్పుడు 72.4 బిలియన్ డాలర్లు. అంతకుముందు జూన్‌లో ముకేశ్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 7వ స్థానంలో ఉన్న హాత్వే బెర్క్‌షైర్‌కు చెందిన వారెన్ బఫ్ఫెట్ స్థానాన్ని అధిగమించారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో ఆసియా ఖండం నుండి వచ్చిన ఏకైక వ్యక్తి ముకేశ్ అంబానీ. మొదటి స్థానంలో అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన నికర విలువ 184 బిలియన్ డాలర్లు. ఆ తరువాత బిల్ గేట్స్ (115 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (94.5 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (90.8 బిలియన్ డాలర్లు), స్టేల్ బాల్మెర్ (74.6 బిలియన్ డాలర్లు), ముకేశ్ అంబానీ (72.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

Mukesh Ambani gets 6th place in World richest person

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి ఆరో స్థానం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: