సిఎల్‌పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా

జైపూర్: కాంగ్రెస్ పార్టీ సిఎల్‌పి సమావేశానికి డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపిన ఆహ్వానాన్ని పైలట్ పక్కన పెట్టాడు. సమావేశానికి సచిన్ పైలట్ సహా పలువురు ఎంఎల్ఎలు డుమ్మా కొట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీ బుజ్జగించినా సచిన్ మెత్తబడటం లేదు. దీంతో రాజస్థాన్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ సిఎంగా కొనసాగడానికి వీల్లేదని సచిన్ ఫైలట్ తేల్చిచెప్పారు. సిఎం పదవి తనకు ఇవ్వకపోయిన పర్వాలేదు. కానీ అశోక్ […] The post సిఎల్‌పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జైపూర్: కాంగ్రెస్ పార్టీ సిఎల్‌పి సమావేశానికి డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపిన ఆహ్వానాన్ని పైలట్ పక్కన పెట్టాడు. సమావేశానికి సచిన్ పైలట్ సహా పలువురు ఎంఎల్ఎలు డుమ్మా కొట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీ బుజ్జగించినా సచిన్ మెత్తబడటం లేదు. దీంతో రాజస్థాన్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ సిఎంగా కొనసాగడానికి వీల్లేదని సచిన్ ఫైలట్ తేల్చిచెప్పారు. సిఎం పదవి తనకు ఇవ్వకపోయిన పర్వాలేదు. కానీ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో పనిచేసేందుకు ససేమిరా అంటున్నాడు సచిన్ పైలట్. అయితే సచిన్ పైలట్ పై అనర్హత వేటు వేయాలని గెహ్లాట్ వర్గం డిమాండ్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. సోమవారం జరిగిన సిఎల్‌పి సమావేశానికి 104 మంది ఎంఎల్ఎలు వచ్చారని గెహ్లాట్ అంటున్నాడు. దమ్ముంటే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గెహ్లాట్ కు పైలట్ సవాల్ విసిరాడు. మరి రాజస్థాన్ లో రాజకీయం మరేన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి.

Sachin Pilot Skips Congress CLP meeting

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సిఎల్‌పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: