బాలీవుడ్ ను కుదిపేస్తున్న ’కరోనా‘

ముంబయి : కరోనా బాలీవుడ్ ను కుదిపేస్తుంది. దీంతో బాలీవుడ్ నటీనటులు , ఇతరులు భయాందోళనలకు గురవుతున్నారు. బిగ్ బి అమితాబ్ కుటుంబంలో నలుగురికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిగ్ బితో పాటు ఆయన కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్, అభిషేక్ భార్య, నటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ కూతురు ఆద్యలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అమితాబ్ భార్య జయకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలో మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ […] The post బాలీవుడ్ ను కుదిపేస్తున్న ’కరోనా‘ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : కరోనా బాలీవుడ్ ను కుదిపేస్తుంది. దీంతో బాలీవుడ్ నటీనటులు , ఇతరులు భయాందోళనలకు గురవుతున్నారు. బిగ్ బి అమితాబ్ కుటుంబంలో నలుగురికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిగ్ బితో పాటు ఆయన కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్, అభిషేక్ భార్య, నటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ కూతురు ఆద్యలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అమితాబ్ భార్య జయకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలో మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో కూడా కరోనా కలకలం రేపింది. అనుపమ్ కు తప్ప అతడి కుటుంబ సభ్యులందరు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్ కు కరోనా వచ్చింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకున్నామని, తమకు నెగిటివ్ వచ్చిందని సారా వెల్లడించారు. తమ డ్రైవర్ కు కరోనా సోకడంతో తాము ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నామని ఆమె వెల్లడించారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బాలీవుడ్ ను కుదిపేస్తున్న ’కరోనా‘ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.