దసరాకల్లా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు

వంతెన నిర్మాణంతో కరీంనగర్‌కు పర్యాటక శోభ, త్వరలో మిగిలిన భూసేకరణ, అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి : మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్: కరీంనగర్ పరిధిలో రూ. 183కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని దసరాకల్లా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నా రు. నగర మేయర్ వై.సునీల్‌రావు, అధికారులతో కలిసి మంత్రి గంగుల సోమవారం కేబుల్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి […] The post దసరాకల్లా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
వంతెన నిర్మాణంతో కరీంనగర్‌కు పర్యాటక శోభ, త్వరలో మిగిలిన భూసేకరణ, అప్రోచ్ రోడ్ల పనులు పూర్తి : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: కరీంనగర్ పరిధిలో రూ. 183కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిని దసరాకల్లా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నా రు. నగర మేయర్ వై.సునీల్‌రావు, అధికారులతో కలిసి మంత్రి గంగుల సోమవారం కేబుల్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ అల్గునూర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న దృష్టా వరంగల్‌తో పాటు దక్షి ణ భారతదేశానికి కలిపేందుకు ప్రత్యేక రహదారి ఉండాలని సిఎం కేసీఆర్ తీగల వంతెనను మంజూరు చేశారన్నారు. తెలంగాణలో మొదట హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారని, కరీంనగర్ తీగల వంతెన రెండవదని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసినప్పటికీ భూసేకరణతో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో కొంచెం ఆలస్యం జరుగుతోందని తెలిపారు.

భూసేకరణ, అప్రోచ్ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. పనులన్నీ అత్యాధుకిన టెక్నాలజీతో పాటు డైనమిక్ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తీగల వంతెన సమీపంలో కొంతమంది కోర్టుకు వెళ్లడంతో తానే ప్రత్యేక చొరవ తీసుకొని వారితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశానని తెలిపారు. కోర్టులో కేసు ఉండడంతో పనుల్లో వేగం తగ్గిందని, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని నెలరోజుల్లో అప్రోచ్ రోడ్ల పనులు పూర్తిచేసి అక్టోబర్ 2వ తేదీ వరకు వంతెనపై ట్రాఫిక్ అనుమతించి రాకపోకలు సాగిస్తామని మంత్రి తెలిపారు. దసరాకు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలకు మార్గం సుగమం అవుతుందని, ఈ తీగల వంతెన హౌరా, ముంబై కేబుల్ బ్రిడ్జిల తర్వాత సౌత్ ఇండియాలోనే అతిపెద్దది అన్నారు. పైన కేబుల్ బ్రిడ్జి, కింద మానేరు రివర్ ఫ్రంట్ నీరు నిలిచి ఉండడంతో కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను డిస్‌ప్లే చేసే విధంగా డైనమిక్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దసరాకల్లా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: